రేవంత్ ను ప‌ల్లేత్తు మాట అన‌ని కేటీఆర్ అండ్ టీం

రాజ‌కీయాలు ఎప్పుడు ఎటు వైపు ట‌ర్న్ తీసుకుంటాయ్, ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రికి శత్రువు అవుతారు ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు ఉండ‌వు. దానికి కాల‌మే స‌మాధానం చెప్తుంది. దీనికి ఇప్పుడు మ‌రో ఉదాహ‌రణ ల‌భించింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌న్నీ కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్. మిగ‌తా ఎన్ని పార్టీలు ఉన్నా… వీటిమ‌ద్యే ప్ర‌ధాన‌మైన పోరుంది అన‌టంలో ఎలాంటి సందేహాం లేదు.

Telangana Elections

అయితే, పార్టీల మ‌ద్యే కాదు, నేత‌లు ఎన్నీ పార్టీల్లో ఉన్నా… ఆ నేత‌ల మ‌ద్య సంభందాలు కూడా రాజ‌కీయాల్లో ప్ర‌ధానం. సరిగ్గా ఇప్పుడు అదే జ‌రుగుతోంది. టీఆర్ఎస్ ప్ర‌చారాన్నంతా కేటీఆర్ త‌న భుజాల‌పై వేసుకొని తిరుగుతున్నారు. అవ‌త‌ల‌వైపు ఉత్త‌మ్ ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. గ‌త కొంత‌కాలంగా ఉత్త‌మ్ వ‌ర్సెస్ కేటీఆర్ అన్న‌ట్లుగానే ప్ర‌చారం, విమ‌ర్శ‌లు- ప్ర‌తివిమ‌ర్శ‌లు సాగుతున్నాయి. కాంగ్రెస్ లో ఉత్త‌మ్ కన్నా సీనీయ‌ర్, పెద్ద నేత‌లు చాలా మంది ఉన్నారు. వారిని కేటీఆర్ పెద్ద‌గా విమ‌ర్శించ‌టం లేదు. కాంగ్రెస్ లో ఉత్త‌మ్ ఒక్క‌డే అన్న‌ట్లు ఆయ‌న టార్గెట్ గానే పావులు క‌దులుతున్నాయి. అందుకే ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న భార్య ప‌ద్మావ‌తి, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల వేట కొన‌సాగిస్తూ, ఎవ‌రికీ టికెట్ ఇవ్వ‌లేదు.

మ‌రోవైపు… ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ ను ఎలా ఎదుర్కొవాలి అన్న వ్యూహాలు వేసిన టీఆరెస్ పార్టీ రేవంత్ విష‌యంలో సైలెంట్ అయింది. మొన్న‌టి వ‌ర‌కు రేవంత్ పై సెటైర్లు వేస్తూ మాట్లాడే కేటీఆర్ అండ్ టీం… ఇప్పుడు రేవంత్ పేరెత్త‌డ‌మే మ‌ర్చిపోయారు. రేవంత్ పై బ‌ల‌మైన అభ్య‌ర్థిని పోటీకి దించిన‌ప్ప‌టికీ, ఆయ‌న‌ను పల్తేత్తు మాట అన‌టం లేద‌ని సొంత‌పార్టీ నేత‌లే చర్చించుకుంటున్నారు. ఓ వైపు ఉత్త‌మ్ ను ఉతికారేస్తూ, విమ‌ర్శించాల్సిన రేవంత్ ను మాత్రం విడిచిపెట్టారన్న‌ది ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హాట్ టాపిక్ అయింది.

అయితే, రేవంత్ తో ఎదైనా… అంత‌ర్గ‌త ఒప్పందం జ‌రిగిందా అన్న అనుమానం వ్యక్త‌మ‌వుతున్నా, అధికారం ఉండ‌గా లేనిది ఇప్పుడెందుకు అలా జ‌రుగుతుంది అన్న వాద‌న వినిపిస్తుంది. చూడాలి… దీంట్లో అస‌లు నిజాలు తెలాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *