కొత్తవాళ్లకు అవకాశమిస్తారా ? లేక పాత వర్గానికే శాఖల మార్చి కేబినెట్ కొనాసాగిస్తుందా ?

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల సరే… మంత్రి పదవుల మాటేంటి ?
తెలంగాణ రాజకీయం ముందస్తు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. దీంతో రాష్ట్రమంతటా రాజకీయాల గురించే చర్చించుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి నిలబడుతున్నాడు? బలబలాలేంటి ? గెలుపెవరది అంటూ ఇలా తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ముందస్తు ముచ్చటతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేశారు. 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించారు.

Telanga Elections

సిట్టింగుల మాట పక్కన పెడితే … ఇప్పుడు చర్చంతా కేబినెట్ వైపు మళ్లింది. ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఎవరెవర్నీ కేబినెట్‌లో సీఎం పెట్టుకోనున్నారు? కొత్తవాళ్లకు అవకాశమిస్తారా ? లేక పాతవాళ్లనే కొనసాగిస్తారా ? ఇప్పుడు ఇదే ప్రశ్నలు రాజకీయ వర్గాల్ని వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తే.. మరికొందరు మాట్రం ఏకంగా మంత్రివర్గాన్నే కోరుకున్నారు. మరి ఇలాంటి వాళ్లకు కేసీఆర్ తన కొత్త కేబినెట్‌లో ఏమేరకు అవకాశం ఇవ్వగలరు? ఎందుకంటే ఇప్పుడే ఎమ్మెల్యే టికెట్ల లొల్లి పార్టీలో కొనసాగుతుంది. సొంత పార్టీలోనే అసమ్మతి రాగాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో తమ వర్గానికి చెందిన నాయకులకు టికెట్ ఇవ్వాలంటూ ఆందోళనలు తెరపైకి వచ్చాయి. దీంతో ఎక్కడికక్కడ పార్టీ అధిష్టానం వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా అసంత‌ృప్తులు మాత్రం పట్టు వీడటం లేదు. మరి ఈ సమయంలో పార్టీలో కొత్తగా చేరినవారికి మంత్రిపదవులు ఇస్తారంటూ పార్టీ శ్రేణులు ఏమంటాయోనన్న భయం గులాబీ బాస్‌ను వెంటాడుతున్నాయి.

కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలంతా మంత్రిపదవులు ఆశించే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటు టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆ మేరకు వారికి హామీలు ఇచ్చినట్లే తెలుస్తుంది. పార్టీలో సముచిత స్థానం ఇస్తామంటూ పలువురు బడా నేతల్ని తమ గూటికి చేర్చుకుంది. మరి అలాంటివారికి రానున్న ఎన్నికల్లో గెలుపు అనంతరం మంత్రిపదవుల్ని కట్టబెడుతుందా? లేక పాత వర్గానికే శాఖల మార్చి కేబినెట్ కొనాసాగిస్తుందా ? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *