తెరాస బిజెపి లోపాయకారి ఒప్పందానికి ఇంకో ఉదాహరణ ఇదే??

తెరాస బీజేపీ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపిస్తున్నా ప్రతిపక్షాల మాటలు నిజమే అని ఇటీవల జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయి.

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి.

Telangana Elections

ఇన్నాళ్లు ముందస్తు ఎన్నికలకు అడ్డంకి కావచ్చు అనుకున్న పోలవరం ముంపు మండలాల ఓటర్ల అంశం కూడా ఒక కొలిక్కి వచ్చింది.

2014 లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని NDA అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన మొదటి జీఓ తెలంగాణ లోని భద్రాచలం డివిజన్ లోని 7 పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర లో కలపడం.

ఇప్పటివరకు భద్రాచలం mla గా ఉన్న సున్నం రాజయ్య తెలంగాణ అసెంబ్లీ కి హాజరు అవుతున్నారు. ఆయనను ఎన్నుకున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో కలిశారు. ఆయన ఏమో తెలంగాణ శాసనసభ కి వెళ్లారు.

ఇప్పటివరకు ఎన్నికల సంఘం కూడా ఆ 7 మండలాల ఓటర్లను ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజక వర్గాలకు మార్చలేదు.
ముందస్తూ కి వెళ్ళాలి అనుకున్న కేసీఆర్ కి ఈ అంశం ప్రతికూలము కావచ్చని చాలా మంది భావించారు.
ఎవరైనా కోర్ట్ కి వెళితే ఈ విషయంలో ఇబ్బందులు రావచ్చని తెరాస వర్గాలు ఆందోళన చెందాయి.
అయితే ఈ రోజు ఈ 7 మండలాలను ఆంధ్ర లోని రంపచోడవరం, పోలవరం నియోజకవర్గల్లోకి కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది.

అసెంబ్లీ రద్దు చేసిన రోజు మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనకు అన్ని హామీలు లభించాకే ఎన్నికలకు వెళుతున్నామని, కేంద్రం తో టచ్ లో ఉన్నామని, కేంద్ర ఎన్నికల.ప్రధాన అధికారి తో తాను స్వయంగా మాట్లాడానని చెప్పాడు.
ఆగమేఘాల మీద జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, నూతన జోనల్ వ్యవస్థ ఆమోదం, నవంబర్ లో ఎన్నికల నిర్వహణ కి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇవన్నీ కేసీఆర్ కోరుకున్నట్టే జరుగుతున్నాయి. ఈ పరిణామాలు అన్ని చూస్తే బీజేపీ తెరాస మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *