పాత పునాదిరాళ్ల కి దిక్కు లేదు ఇప్పుడు కొత్తవా..?

పాత పునాదిరాళ్ల కి దిక్కు లేదు ఇప్పుడు కొత్తవా..? పాలమూరు పై సవతి ప్రేమ చూపిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం. ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు కేటీఆర్ ఈటెల?  – ఏఐసిసి కార్యదర్శి ఎస్.ఎ సంపత్ కుమార్”గారు.

ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏ ఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ సంపత్ కుమార్ గారు పాత్రికేయుల సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ *దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో అక్కడ 52 ఎకరాలు ఇచ్చిన భూనిర్వాసితులకు ఇంత వరకు ఎలాంటి న్యాయం జరగలేదని, డబుల్ డబుల్ బెడ్ రూమ్లు కూడా టిఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు కట్టబెట్టారని, అడగడానికి వెళ్లిన నాయకులను అరెస్టు చేసి కేసులు బుక్ చేశారన్నరు, ప్రస్తుతం దివిటీ పల్లి డబల్ బెడ్ రూమ్ ల విషయం కోర్టులో ఉందని, భూనిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేశారో? అలాట్మెంట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు జీవో ప్రకారం డబుల్ బెడ్ రూమ్లు కేటాయించాలనే మార్గదర్శకాలను ఎందుకు ప్రభుత్వం పాటించట్లేదు అని ప్రశ్నించారు.

కేటీఆర్ పారిశ్రామిక మంత్రిగా ఉండి మహబూబ్ నగర్ కి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇవ్వలేదు. ఇక్కడున్నా నిరుద్యోగులకు యువకులకు దీనిపై సమాధానం చెప్పాలన్నారు. దళితులకు సంబంధించి  దళిత ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కు వేల కోట్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కానీ పాలమూరులో ఒక దళిత కి ఒక రూపాయి కూడా శాంక్షన్ చేయలేదు. అలా చేసి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలిపారు.

ఉత్తర తెలంగాణలో త్వరితగతిన ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మాత్రం అన్ని ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు.

సరళ సాగర్ సైఫాన్ సిస్టం  గల ప్రాజెక్టు చరిత్రాత్మ కలిగినది. కట్ట తెగి పోయి నెలలైనా  దాని పై ఊసే లేదు పైగా అక్రమ ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అన్నారు.

వీరన్న పేట డబుల్ బెడ్ రూమ్ విషయం లో 25000 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ కేవలం కొంతమందికి అర్హులకు ఇచ్చి మిగతావన్నీ టిఆర్ఎస్ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారని దీనిపైన పూర్తి  విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని సూచించారు

ఎస్సీ సబ్ ప్లాన్ విషయంలో నిధులన్నీ అన్ని మున్సిపాల్టీల్లో నిధులన్నీ దారి మల్లుతున్నాయని ఆరోపించారు

ఆర్బాటంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి ఎంత వరకు వచ్చింది అక్కడ ఉన్న ప్రారంభంలో ప్రారంభించిన బోటు ఏమైందని అని ప్రశ్నించారు

జిల్లా కేంద్రంలో గల పాత తోట, పాత పాలమూరులో కేసీఆర్ గారు కుర్చీ వేసుకుని పేదలకు ఇళ్లు కట్టించి దావత్ చేసుకుందాం అన్న సంగతి ఏమైంది…* *పై విషయాలన్నీ టికీ కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు వినోద్ కుమార్ గారు,ఎన్.పి వెంకటేష్, కాటం ప్రదీప్ కుమార్ గౌడ్,షాద్ నగర్ నియోజకవర్గ ఇంచర్జ్ పీర్ల పల్లి శంకర్ గారు,ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్ గారు,పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *