కొండను తవ్వి, ఎలుకను పట్టి. రేవంత్ ఇంట్లో ఇదీ జరిగింది
రేవంత్ పై గంటలకు గంటలు సోదాలు చేసిన అధికారులకు ఆయన ఇంట్లో షాక్ లపై షాక్ లు తగిలినట్లు తెలుస్తోంది. రేవంత్ ప్రత్యర్థులకు ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలకు ఇది మింగుడు పడని వార్తే. రేవంత్ పై ఎన్నో పేపర్లకు పేపర్లతో వ్యతిరేక మీడియాతో ప్రచారం చేయించి మరీ 1000కోట్ల ఆస్తులు గుర్తించినట్లు, రేవంత్ అరెస్ట్ తప్పదన్నట్లు ప్రచారం చేశారు. కానీ ఈ సోదాల సమయంలో రేవంత్ ఇంట్లో ఎం జరిగింది….? ఇదీ కథ.
1000కోట్లు అని ప్రచారం చేస్తూ… 30 గంటలకు పైగా ప్రశ్నించా.రు. సోదాలు జరుగుతున్న సందర్భంలో…రేవంత్ చిరునవ్వుతో జరుగుతున్న తతంగాన్ని చూసినట్లు తెలుస్తోంది. రేవంత్ కొడంగల్ నుండి ఇంటికి చేరగానే… అధికారులు ప్రశ్నించేందుకు రెడీ అవ్వగా, ఇప్పుడే వచ్చా కదా, కాస్త ఫ్రెష్ అయి వస్తా అంటూ… వెళ్లి వచ్చారు. ఆ తర్వాత అధికారుల సోదాల సమయంలో… కొంతమంది ఉన్నాతాధికారులు, మంత్రులు, టీఆర్ఎస్ నేతలకు సంబందించిన అవినీతి అంశాల ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇవి చూసి అధికారులే అవాక్కయినట్లు సమాచారం. అధికారులు వెళ్తూ, వెళ్తూ… అక్కడ జరిగిన సోదాలకు చెందిన పేపర్లపై రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక సోదాలు పూర్తయ్యాక… మీడియాకు వచ్చిన లీకును బట్టి 20కోట్ల లెక్కచూపని ఆస్తులు దొరికాయని బయటకు వచ్చింది. అయితే… అంతకుముందు వరకు జరిగిన కోటి రూపాయాల నగదు దొరికిన ప్రచారం పక్కనపడిపోయింది. పైగా ఆ లెక్కచూపని ఆస్తులు శ్రీమౌర్య కంపెనీ పేరుతో ఉన్నాయని తెలుస్తోంది. ఆ కంపెనీ 2011 నుండి పన్ను కట్టడం లేదు. అయితే, మనకు అందుతున్న సమాచారం ప్రకారం… ఆ కంపెనీతో నేరుగా రేవంత్ కు సంబందం లేకపోయినా, ఆయన బందువులు అందులో భాగస్వాములుగా వివిధ హోదాల్లో ఉన్నారు. అయితే, ఆకంపెనీ లో వచ్చిన మనస్పర్ధల కారణంగా… ఆ కంపెనీ కి సంబందించి ఓ కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నట్లు ఆయన వర్గీయుల వాదన. అందుకే పన్ను చెల్లింపులు చేసి ఉండకపోవచ్చని, దానిపై పూర్తి వివరాలు అతి త్వరలోనే బయట పెడతామని అంటున్నారు.
అయితే, రేవంత్ కు సోదాలపై ముందే సమాచారం కూడా ఉంది. ఆయనే స్వయంగా కూడా చెప్పారు. ఒకటి రెండు రోజులయితే… ఏకంగా ఆయన నివాసంలో, రేవంత్ అనుచరులు సోదాలకు అధికారులు వస్తున్నారని వెయిట్ చేశారట. కానీ కాస్త ఆలస్యం అయిందని…. వీ ఆర్ ప్రిపేర్డ్ అంటూ రేవంత్ వర్గీయులు దీమాగా సమాధానం చెబుతున్నారు.
అయితే, 20కోట్ల అక్రమాస్థులు నిర్దారణ అయినా…. రేవంత్ టీఆర్ఎస్ అనుకున్నంత మేర ఇరికించలేకపోయిందన్న వాదనలు వినపడుతున్నాయి. పైగా అందులో నేరుగా రేవంత్ ను ఏమీ చేయలేరు కాబ్టటి, కొండను తవ్వి, ఎలుకను కూడా పట్టలేకపోయామన్న భాద వ్యక్తమవుతోంది. పైగా ఈ దెబ్బతో రేవంత్ కు కావాల్సినంత సానుభూతి వచ్చే అవకాశం ఉందని, ఈ కేసు నిలబడలేకపోతే… భవిష్యత్ లో ఆయన కు ఇది మరింత బూస్ట్ నిస్తుందంటున్నారు విశ్లేషకులు.
We want same ride onTRS leader’s.
Mission Kakatiya, Mission Bhagiratha & kaleswaram projects are fraud.
There is big scam in that
No body will touch him god is there
T R S LO KODA chalmandunaru ok house lo 4 mambera minesters valu ata sampdecaru
Before elections this type of politics is common.