మ‌హ‌కూటిమిలో పార్టీలు పోటీచేయ‌బోయే సీట్లివే

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు జట్టు క‌ట్టిన ప్ర‌తిపక్షాల పొత్తులు చివ‌రిద‌శ‌కు చేరుకున్నాయి. ఎవ‌రు ఎక్క‌డి నుండి పోటీ చేయాలి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ప్ర‌చార ఎజెండా ఏవిధంగా ఉండాలి… పెద్ద నాయ‌కుల ప్రచార తీరు ఎలా ఉండాలి, ఇలా అన్నిటిపై అవ‌గాహాన వ‌చ్చారు. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే మిగిలివుండ‌గా… మ‌న‌కందుతున్న తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హ‌కూట‌మిలో సీట్ల విభ‌జ‌న ఇలా ఉంది. 18+9+3+2+87 గా పంప‌కాలు జ‌రిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 87 స్థానాలు, తెలంగాణ జ‌న‌స‌మితి 9 స్థానాలు, సిపిఐ 3 స్థానాలు, తెలంగాణ ఇంటి పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Telangana coalition

టీఆర్ఎస్ ను గ‌ద్దెదించ‌ట‌మే ల‌క్ష్యంగా ఏర్ప‌డ్డ కూట‌మి కావ‌టంతో… సీట్ల పంప‌క‌మే కాకుండా, గ‌ట్టి అభ్య‌ర్తుల‌ను దింపాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. టీడీపీ కోరుకుంటున్న సీట్ల‌తో పాటు సీట్ల ఆశావాహులు వివ‌రాల్లోకి వెళ్తే…

దేవరకద్ర – రావుల చంద్రశేఖర్‌రెడ్డి,
మక్తల్ – కొత్తకోట దయాకర్‌‌రెడ్డి,
మహబూబ్‌నగర్- చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్ )
రాజేంద్రనగర్-ఎమ్ భూపాల్‌రెడ్డి,
శేరిలింగంపల్లి -మండవ వెంకటేశ్వరరావు, లేదా మొవ్వ సత్యనారాయణ
కూకట్‌పల్లి- శ్రీనివాసరావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – ఎం.ఎన్.శ్రీనివాసరావు,
సికింద్రాబాద్ – కూన వెంకటేష్‌గౌడ్.
ఉప్పల్- వీరేందర్‌గౌడ్.
ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు.
కోరుట్ల-ఎల్ .రమణ
హుజూరాబాద్ లేదా కూక‌ట్ ప‌ల్లి. – ఇనగాల పెద్దిరెడ్డి ,
ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ,
పరకాల లేదా వరంగల్ వెస్ట్ – రేవూరి ప్రకాష్‌రెడ్డి.
ఆలేరు – శోభారాణి,
కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్.
మిర్యాలగూడ -శ్రీనివాస్ (వ్యాపార వేత్త).
ఖమ్మం – నామా నాగేశ్వరరావు,
సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య ల‌తో లిస్టు రెడీ అయింది. ఈ లిస్టు మ‌హ‌కూట‌మి ఉమ్మ‌డి ఆమోదం పొందాల్సి ఉండ‌గా….

టీజెఎస్ కూడా త‌మ‌కు కావాల్సిన స్థానాల‌ను మ‌హ‌కూట‌మి ముందుంచింది. అందులో
సికింద్రాబాద్
ముషీరాబాద్
అంబ‌ర్ పేట లేదా ఎల్లారెడ్డి
మ‌ల్కాజ్ గిరి
ఇబ్ర‌హీంప‌ట్నం
సిద్ధిపేట‌
మంచిర్యాల‌
దుబ్బాక‌
వ‌రంగ‌ల్ ఈస్ట్.

ఇక సిపిఐ నుండి మూడు స్థానాలు కోరుతుండ‌గా అవి హుస్నాబాద్ — చాడ వెంక‌ట్ రెడ్డి
బెల్లంప‌ల్లి — గుండా మ‌ల్లేష్
దేవ‌క‌కొండ‌.

ఇక ఇవి పోనూ మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేయ‌నుంది. మ‌రీ సీట్ల లొల్లి ముందే పూర్తిచేసిన కూట‌మి… ఎంత‌వ‌ర‌కు గెలుస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *