వలస కార్మికుల కష్టాలు మరియు కరోనా నివారణ కోసం మదన్ మోహన్ చేస్తున్న కృషికి అవార్డ్ దక్కింది.

హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్  ఆఫ్ ఇండియా  సంస్థ ఈ అవార్డును ప్రకటించింది కరోనా కోవిద్ 19 వైరస్ ప్రబల కుండ ఓజోన్ మరియు హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేస్తూ మరియు ఆయన  చేస్తున్న సహాయము పేద ప్రజలకు ఆర్థిక సహాయ మరియు ఆకలి చావులు ఆపడానికి నిత్యవసర సరుకులు పంపిణీ  పరిరక్షణ, వలస కూలీలు గమ్యస్థానానికి చేరడానికి చేస్తున్న సేవలు వివిధ అంశాలపై ఆయన చేసిన పలు సేవలకు గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
వలస కార్మికుల విషయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా వైఫల్యం చెందడంతో వారు రహదారుల వెంట, రైల్వే ట్రాక్ ల వెంట వందల కిలోమీటర్ లు కాలినడకన నడుస్తున్నారు.
వాళ్ల రక్తంతో రహదారులు, రైల్వే ట్రాక్ లు ఎర్ర బారిన, ఈ మొండి పాలకుల గుండెలు కరగ లేదు పైగా వాళ్ల దగ్గర డబుల్ ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తాం అన్నారు.
వలస కార్మికుల కష్టం చూసి చలించిన అమ్మ సోనియా గాంధీ గారు దేశ వ్యాప్తంగా వలస కార్మికులను వాళ్ల గమ్య స్థానాలకు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ చేరుస్తుందని మాట ఇచ్చింది. 
మా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు వాళ్ళని గుర్తించి గమ్యస్థానాలకు చేర్చాలి. వాళ్ళని గుర్తించడం కోసం కృత్రిమ మేధస్సు తో కూడిన వెబ్సైట్ ప్రారంభించాం అని మదన్ మోహన్ గారు మీడియా కి తెలిపారు.

వెబ్సైట్ డిటైల్స్
టిపిసిసి ఐటి సెల్ – మైగ్రెంట్ లేబర్ ట్రావెల్ ప్లానింగ్ కోసం యుఎస్ఎమ్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన చాట్బోట్.
మైగ్రేంట్ లేబర్ డేటాను సేకరించడానికి దిగువ లింక్‌ను ఉపయోగించండి.

టాప్ రైట్ ఐకాన్ క్లిక్ చేస్తే, మీరు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల మధ్య మారవచ్చు

http://charmsinc.in/chat/index-hindi.html

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు నాకు రావడం చాలా గర్వంగానూ సంతోషంగాను ఉందని ఓజోన్ & హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడానికి పర్మిషన్ ల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని నారాయణఖేడ్ లో మా పై కేసులు కూడా పెట్టారని ఇదేదో రాజకీయ మైలేజీ కోసం కాకుండా ప్రజల ప్రాణాల కోసం వాళ్లు పడుతున్న కష్టాలను చూసి వారికి సేవ చేయడానికి  ముందుకు వచ్చి చేస్తున్న అన్నారు.
ప్రజలకు సేవ చేయడంలో ఎంతో మనశ్శాంతి ఉంటుందని అన్నారు ఎన్ని అడ్డంకులు కలిగించిన అధికారంలో ఉన్న  లేకున్నా ప్రజలకు సేవ చేయడం లో ముందు వరుసలో ఉంటా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *