చేతకాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలి // కోదండరాం

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి –                 నిరసన దీక్షలో ప్రొఫెసర్ కోదండరాం

ఈ రోజు TJS పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  కరోనా పై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తున్నదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నిరసన దీక్ష కూర్చోవడం జరిగింది.  ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న  ప్రొఫెసర్ కోదండరాం మాట్లాతు.


1. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు ఉచితంగా రేషన్ మరియు రూ.7500/ లు నగదు రెండు నెలలు ఇవ్వాలి .
2. ప్రజా ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యత గా గుర్తించి వెంటనే టెస్టుల సంఖ్య పెంచాలి.
3. రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర వైద్య సౌకర్యాలు కల్పించి కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలి.
4. వృత్తులకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి.
5. చిరు వ్యాపారులను చిరు ఉద్యోగులను ఆదుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
6. సి ఏం రిలీఫ్ పండ్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి.
7. సచివాలయంను కూల్చకుండా కోవిడ్ 19 కు ఉపయోగించాలి
8. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రకటన చేయాలి కరోన వైరస్ నివారణకు చర్యలు ఉచితంగా రేషన్ సరుకులు నవంబర్ వరకు ఇవ్వాలి.
9. రాష్ట్ర ఖజానను ఆగం చేస్తున్నారు,టెస్టులు పెంచాలి, సామాన్య ప్రజలను ఆదుకోవాలని, కోర్టు లు చెప్తున్న పట్టించుకోవడం లేదు, చేతకాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.

10. కోవిడ్ కోసం దాతలు ఇచ్చిన పైసలపై శ్వేతా పత్రం విడుదల చేయాలి, డిమాండ్ చేశారు.

కోదండరాంగారి దీక్ష కు సంఘీభావం గా  CPI రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, TDP అధ్యక్షులు L. రమణ, న్యూడెమోక్రసీ నాయకులు, చలపతిరావు, గోవర్ధన్, శివసేన నాయకులు నర్శింహ రెడ్డి, POW సంధ్య, అనూరాధ మద్దతు తెలిపారు.
కోదండరాం గారి దీక్ష ను AICC కార్యదర్శి సంపత్ కుమార్ విరమించారు. ఈ దీక్ష కు సబాధ్యక్షులుగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నర్సయ్య వహించారు. ఈ దీక్షలో కూర్చున్న వారు TJS పార్టీ ఉపాధ్యక్షులు PL విశ్వేశ్వర్ రావ్, గోపగాని శంకర్రావు, శ్రీశైల్ రెడ్డి, విద్యార్థి జన సమితి కన్వినర్ నిజ్జన రమేష్ ముదిరాజ్, రాయప్ప, మెడ రవి, పల్లె వినయ్, మాల్లారెడ్డి, భవాని రెడ్డి, కొత్త రవి, రంగారెడ్డి,  రాంచందర్, సత్యనారాయణలు, శ్రవణ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *