తెలంగాణ గజినిగా మారిన కేసిఆర్

తెలంగాణ మేధావులు మేల్కొనండి మళ్ళీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆంధ్ర వాళ్ళ వద్ద తాకట్టు పెడదమా . ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్

లేడికి లేచిందే పరుగు అన్నట్టు
నువ్వు ఎప్పుడు ఎట్లా మారుతావో తెలియదు సారు.

ghajini TRS KCR

నీకు గజని సినిమాలో లాగా ఏమన్నా మెమరీ లాస్ ఉందా ఏంది.

అప్పట్ల ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లు అంత దొంగలు అంటివి,
మన అన్ని కష్టనష్టాలకు వాళ్లే కారణం అంటివి.
తన్మయత్వలో సప్పట్లు కోడితిమి.

లంకల పుట్టిన వాళ్లంతా రాక్షసులే
ఆంధ్ర లో పుట్టిన వాళ్లంతా దొంగలే అంటే ఉద్రేకంలో ఈలలు వెస్తిమి.

మాకు వాళ్లతో ఏమన్నా గట్టుకాడా పంచాయతీ ఉందా, లేక ఆస్తుల పంపకం లో తగాదా ఉందా.
నీ మాటలు నమ్మి దోస్తులు, తెలిసిన ఆంధ్ర వాళ్ళను కూడా శత్రువులుగా చూస్తిమి.

ఒక దశలో పాకిస్తాన్ ఇండియా వల కన్నా ఎక్కువ శత్రుత్వం పెట్టిస్తివి ఆంధ్ర తెలంగాణ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు తెస్తివి.

ఉద్యోగులు, లాయర్ లు, విద్యార్థులు, కార్మికులు, సాధారణ జనం అంత ఒకరిని ఒకరు నమ్మకుండా చేస్తివి
నీ మోసపూరిత మాటలతో, ఉద్రేకాలను రెచ్చగొడితివి.

సరే పెద్ద సార్ మా కోసం ఇదంతా చేస్తుండు అనుకుని ఉకుంటిమి.

తెలంగాణ వస్తే చాలు నాకు ఇంకా ఏమి కోరికలు లేవు.
నా కొడుకు బిడ్డ అమెరికా ల ఉన్నారు. నేను నా ముసల్ది వచ్చిన తెలంగాణ కృష్ణ రామ అని కూసుంటాం అంటే సార్ కి భలే కమిట్మెంట్ ఉందని సంబరపడితిమి.
తెలంగాణ కోసం కొట్లాడేది కడుక్క తాగటానికి కాదు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అబ్బో సార్ విజనరి అని సంకలు గుద్దుకుంటిమి.

నాకు పదవులు వద్దు తెలంగాణ లో దళితుడే తొలి ముఖ్యమంత్రిగా ఉంటాడు తలా నరుక్కుంటా కానీ మాట తప్పును మడమ తిప్పను అంటే మా గుండెలు ఉప్పొంగిపోయే.

పదవే వద్దు అన్నోనివి దఫాదఫాలుగా కుటుంబంలో 5 పదవులు తీసుకుంటిరి.
త్యాగాలు చేసిన పిల్లలకు 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం మీకు దయ కలగకపోయే.

తెలంగాణ వచ్చాక

నరణారణ తెలంగాణ ని వ్యతిరేకించిన లగడపాటి ని ప్రగతి భవన్ కి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించమన్నది ఎవరు?

నిండు అసెంబ్లీ సాక్షిగా రాజీనామాల డ్రామా ఆడి వచ్చిన తెలంగాణ ని వాయిదా వేయించిన పయ్యావుల కేశవ్ తో రాసుకు పుసుకు తిరిగుంది ఎవరు.

తెలంగాణకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసి అయ్యో తెలంగాణ రాదేమో అని రంది పడి వందలాది బిడ్డల ఉసురు తీసుకున్న ఆంధ్ర మీడియా అధిపతులకు అప్పనంగా భూములు పంచుతున్నది ఎవరు??

మిమ్మల్ని బండ బూతులు తిట్టి తెలంగాణ వచ్చిందని 15 రోజులు అన్నం ముట్టని పవన్ కళ్యాణ్ తో అంట కాగుతున్నది ఎవరు.??

నాగేశ్వర్ రావు కొడుకు నాగార్జున కబ్జాకోరు అని అప్పుడు అంటివి. ఇప్పుడేమో వాళ్ళ కుటుంబం అంత ఫామిలీ ప్యాక్ తో మీరు, మీ పుత్ర రత్నం కల్సి తిరగవట్టే.

దోచుకుతిన్న ఆంధ్ర కాంట్రాక్టర్లు అప్పటికన్న ఎక్కువ దోచుకోవట్టే.
మేఘ కృష్ణారెడ్డి కి సన్మానం ఎవరు చేశారు.??

మన యాస భాష ని వెక్కిరించిన సినిమా వాళ్ళతో నీ కొడుకు చీకటి లీలలు, సేల్ఫీ ల భాగోతం ఏంది?

ఏ భాష పేరు చెప్పుకొని సీమాంధ్ర వాళ్ళు మన పై ఆధిపత్యం చేశారో అదే భాష తెలుగు ప్రపంచ మహాసభలు 100 ల కోట్ల ఖర్చుతో చేయమని చెప్పింది ఎవరు?
అందులో అందెశ్రీ, గద్దర్, లాంటి తెలంగాణ బిడ్డలు ఎంతమంది పాల్గొన్నారు.
అప్పుడు గుర్తుకు రాలేదా తెలంగాణ మేధావుల అవసరం.
ఓట్లు, సీట్ల సమయంలోనే నీకు తెలంగాణ ప్రజలు, మేధావులు గుర్తుకు వస్తారా

ఆంధ్రోళ్లు అంత దొంగలు అన్న నోటితోనే ఆంధ్రోళ్ళ కాలికి ముళ్ళు గుచ్చితే నా పంటితో తీస్తా అని పచ్చి అబద్దాలు మాట్లాడడం నీతోనే ఐతది.

మిగతా అన్ని సమయాల్లో వాళ్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని ఇప్పుడు ఇలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం ఎంత వరకు సమంజసం.
అయ్యా నువ్వు ఒరగబెట్టింది చాలు ఇగ దిగిపో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *