కేసీఆర్ కు మూహుర్తం టెన్ష‌న్, పోలింగ్ నాడు అమావాస్య‌

రాజ‌కీయ నాయ‌కుల న‌మ్మ‌కాలు… అంతా ఇంతా ఉండ‌వు. సెంటిమెంట్లు పాటించేవారిలో, జ్యోతిష్యం, ముహుర్తాలు, యాగాలు చేయ‌టంలో రాజ‌కీయ నాయ‌కుల త‌ర్వాతే మ‌రొక‌రు. వీటి న‌మ్మే వాటిలో, రాష్ట్రంలోనే ముందుండేవారు కేసీఆర్. గులాబీ బాస్ కు ఈ న‌మ్మ‌కాలు చాలా ఎక్కువ‌. ఆయ‌న న‌మ్మ‌కాల‌కు… కేసీఆర్ ప‌క్క‌నోళ్లే విసుక్కుంటారు. కానీ ఎదురు చెప్పే దైర్యం చేయ‌రు.

కేసీఆర్ అమ‌వాస్య‌నాడు అడుగైనా బ‌య‌ట‌పెట్ట‌డు. ఎంత పెద్ద ప‌ని ఉన్నా… వాయిదా వేసుకుంటారు కానీ ఏ ప‌నీ చేయ‌రు. పైగా సంఖ్యాశాస్త్రం పై ఎంత న‌మ్మ‌కంటే… ఎం చేసినా త‌న అధృష్ట సంఖ్య 6 ఉండాల్సిందే. అందుకే… ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేసుకున్న తేదీలు, స‌మ‌యాలు… ప‌క్క‌గా ఉంటాయి. అదీ ఓ సంచ‌ల‌నం. అధృష్ట సంఖ్య‌ల కోసం ప్ర‌జ‌ల‌ను ఇబ్బందిపెడుతారా అని ఎవ‌రు ఎంత మొత్తుకున్నా, విన‌డంటే విన‌డు. అదీ ఆయ‌న‌కు న‌మ్మ‌కాల‌పై ఉన్న న‌మ్మ‌కం.

అందుకే… ప్ర‌బుత్వాన్ని ర‌ద్దు చేసిన నాడు కేసీఆర్ ఓ మాట అన్నాడు. న‌వంబ‌ర్ 24న ఎన్నిక‌లు ఉంటాయ‌ని. అంటే 4+2=6, సంఖ్యాశాస్త్రం ప్ర‌కారం త‌న ల‌క్కీ నెంబ‌ర్. డిసెంబ‌ర్ 5న ఫ‌లితాలుంటాయి… 6న ప్ర‌మాణ‌స్వీకారం. దీన్ని బ‌ట్టి అర్థః చేసుకోవ‌చ్చు… ప‌క్కాగా పండితులు, తాను న‌మ్ముకున్న సిద్దాంతులు చెప్పిన‌ట్లే మోడీని ఒప్పించుకోగ‌లిగారు. ఆ ముహుర్తంలో అయితే, కేసీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవుతాడ‌న్న‌ది ఆయ‌న న‌మ్మ‌కం.

కానీ ఏం లాబం, తాను ఓ మాట అలా తూలటంతో… ఎన్నిక‌ల సంఘం తేదీలు మార్చింది. దీంతో డిసెంబ‌ర్ 7న ఎన్నిక‌లు. ఛ ఒక్క‌రోజు ముందు వ‌చ్చివుంటే, ఎంత బాగుండు అని టీఆర్ఎస్ లో ముఖ్య‌నేత‌లు చ‌ర్చించుకునే లోపే పిడుగులాంటి వార్త కేసీఆర్ చెవిన ప‌డింది. డిసెంబ‌ర్ 7 పోలింగ్ రోజు అమావాస్య కావ‌టం. డిసెంబరు 6వ తేదీన మధ్యాహ్నం 11గంటల 59 నిమిషాలకు అమావాస్య మొద‌లై, డిసెంబరు 7వ తేదీన మధ్యాహ్నం 12.16 గంటలకు పోతుంది. స‌రిగ్గా అమావాస్య నాడే అంటే డిసెంబరు 7నే ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సో… అమావాస్య నాడు పోలింగ్. కేసీఆర్ అడుగు కూడా బ‌య‌ట‌పెట్ట‌డు.

కేసీఆర్ సెంటిమెంట్ ప్ర‌కారం… ఎన్నిక‌లు జ‌ర‌గ‌వు. సీఎం స్థానంలో ఉండి… తానే ఓటు వేయ‌కుండా ఉంటే, ఉంటాడా….? ఉన్నా ఉంటాడు. ఏ అనారోగ్యం తోనే బ‌య‌ట‌కు రాలేదు అని చెప్పుకోవ‌చ్చు, కానీ త‌న‌కు ఈ ముహుర్తం ఏంత‌వ‌ర‌కు లాభం చేకూరుస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *