హరీష్ రావు పై పెద్ద భారం వేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావుకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
అది ఏంటంటే సాగు నీటి శాఖ కు సంబంధించిన బడ్జెట్ వివరాల గురించి
బడ్జెట్ సమావేశంలో మాట్లాడాల్సిందిగా హరీష్ రావుని కోరారు. గతంలో హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉండటం తో కేసీఆర్ ఈ భాద్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఈసారి సాగునీటి శాఖకు 8 వేల కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ కేటాయించే అవకాశముంది. గతేడాది కన్నా వెయ్యి కోట్లు అధికంగా కేటాయించడంతో పాటు మరో 15 వేల కోట్ల రూపాయల వరకు రుణం తీసుకోవడం ద్వారా సుమారు 23,500 కోట్ల రూపాయల వరకు వచ్చే ఏడాది సాగునీటి రంగం పై ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అందింది.ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలల్లో సాగునీటి పారుదల పైన మరియు సాధారణ పరిపాలన శాంతిభద్రతలకు సంబదించి సభలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే భాద్యతను హరీష్ రావుకు అప్పగించారు.
Especially helpful….look ahead to coming back again.