KCR పాలన పై సాంస్కృతిక యుద్దం ప్రకటించిన కోదండరాం
నిరంకుశంగా,
ప్రజాస్వామిక గొంతులను నొక్కుతూ బంగారు తెలంగాణా ముసుగులో చేస్తున్న తెరాస గడిలా పాలన బద్దలు కొట్టడానికి తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని సర్కస్ గ్రౌండ్స్ లో october 1 సాయంత్రం 5 గంటలకు లక్ష మందితో, వందలాది కళాకారులతో తెలంగాణ ధూమ్ ధాం.
తమ పాటలతో తెలంగాణవాదాన్ని గడప గడప కి చేర్చిన కళాకారులే
నేడు గజ్జెకట్టి తలపొగరు నెత్తికెక్కిన తెరాస కుటుంబ పాలన అంతమొందిచడానికి ఆడి పాడి కదం తొక్కబోతున్నారు.
ఏ తెలంగాణ కోసం అయితే సీమాంధ్ర వలస పెట్టుబడి దారులతో కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో అది ఇంకా పరిపూర్ణం కాలేదని, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో బంగారు తెలంగాణా ముసుగులో ఒక కుటుంబం చేస్తున్న అవినీతి అక్రమాల ను ప్రజలకు చాటెత్తి చెప్పడానికే ఈ ధూమ్ ధామ్.
అమరుల ఆశయాల సాధనకై
ప్రజలను చైతన్యవంతులను చేయడం ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం.
తెలంగాణ ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డ తరువాత ఇంత పెద్ద ఎత్తున కళాకారులు ఒక వేదిక మీదకి రావడం ఇదే తొలిసారి.
తెలంగాణ సాంసృతిక సారధి పేరిట కొంతమంది కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించుకొని తెరాస పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్న సందర్భంలో, అర్హత లేని వాళ్ళను అనుయాయులను, డబ్బులు ఇచ్చినవాళ్లను అక్రమంగా నియమించి అర్హులకు ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతున్న దొర అహంకార పాలన మీద కళాకారులు చేస్తున్న ధర్మయుద్దం ఇది.
ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షులు ప్రో.కోదండరాం గారు, రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు అజిత్ సింగ్ గారు
కళాకారులు నెర్నల కిషోర్,
దరువు ఎల్లన్న,
దరువు అంజన్న,
వరంగల్ రవి,
రామలింగం,
నాగరాజు
రమాదేవి మొదలైన
కళాకారులు పాల్గొంటారు.
రండి కదలి రండి
గడిలా పాలన బద్దలు కొట్టి అమరుల ఆశయాల సాధనకై నూతన ప్రజాస్వామిక పాలన తెచ్చుకుందాం.
జై తెలంగాణ ✊🏻
జై తెలంగాణా జన సమితి.✊🏻