హ‌రీష్ ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రచారానికి ఎందుకు వెళ్ళడం లేదో తెలుసా…?

టీఆర్ఎస్ లో అంత‌ర్గ‌త పొరు ఇంకా చ‌ల్లార‌లేదా…? పైకి క‌న‌ప‌డ‌కున్నా కుమ్ములాట‌లు కొన‌సాగుతున్నాయా….? హ‌రీష్ ను ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌చారం నుండి పూర్తిగా త‌ప్పించారా…? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇప్ప‌టికే హ‌రీష్ ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ల‌టం మానేశారు. ఉంటే హైద‌రాబాద్ లేదంటే సిద్ధిపేట త‌ప్పా… ఇంకోచోట హ‌రీష్ హాడావిడ ఏమాత్రంలేదు. అప్పుడ‌ప్పుడు మార్గ మ‌ద్య‌లో గ‌జ్వేల్ లో మండ‌ల స్థాయి మీటింగ్ ల‌కు వెళ్తున్నా… అలా వెళ్లి, ఇలా వ‌చ్చేస్తున్నారు.

Telangana Elections

హ‌రీష్ ఇప్ప‌టికే సిద్ధిపేట ప్ర‌చారంలో దూసుక‌పోతున్నారు. హ‌రీష్ కు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ హ‌రీష్ సిద్ధిపేట స‌రిహ‌ద్దు దాటడం లేదు. దీనికంతా పై నుండి వ‌చ్చిన ఆదేశాలే అన్న‌ది బ‌హిరంగ రహ‌స్య‌మే. మ‌రోవైపు కేటీఆర్ మాత్రం ప్రచారాన్ని అన్ని జిల్లాల‌కు విస్త‌రించారు. సీట్లు ప్ర‌క‌టించిన స్థానాల్లో అసంతృప్తులు ఉంటే, వారిని పిలిపించుకొని మాట్లాడ‌టం, సెటిల్ చేయ‌టం అన్నీ తానే చూసుకుంటున్నారు. కేసీఆర్ కూడా త‌ప్ప‌దు అనుకున్న ఒకటి అర అంశాల్లో మిన‌హా బాధ్య‌త‌ల‌న్నీ కేటీఆర్ కే అప్ప‌జెప్పాడు.

ఇదే విష‌యంపై… అనేక అనుమానాలు, వార్త‌లు బ‌య‌ట‌కొచ్చినా, ఇంకా హ‌రీష్ కేటీఆర్ ల మ‌ద్య పూర్తిస్థాయి సంధి జ‌ర‌గ‌లేన‌ట్లు తెలుస్తోంది. హ‌రీష్ స‌భ‌ల‌కు క‌వరేజీ లేద‌ని, పార్టీ మీడియాల్లో బ్యాన్ చేశార‌ని… వార్త‌లు వ‌చ్చాయి. అలాంటిది ఏమీలేద‌ని అంద‌రూ పైకి ఖండించినా, ఆ త‌ర్వాత కూడా పెద్ద‌గా ఆయ‌న వార్త‌లు వ‌చ్చింది లేదు. సో… హ‌రీష్ ను సిద్ధిపేట‌కే ప‌రిమితం చేశారు అని ఆయ‌న వ‌ర్గీయులు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. మ‌రోవైపు, హ‌రీష్ స్టామినా తెలిసినా కేసీఆర్…కొడుకు కోస‌మే హ‌రీష్ ను ప‌క్క‌న‌పెడుతున్నార‌న్న అభిప్రాయం రోజురోజుకు పెరుగుతోంది. ఇటు అభ్య‌ర్తులు కూడా హ‌రీష్ దూరంగా ఉండ‌టం పార్టీకి పెద్ద‌మైన‌స్ అని అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు.

మొన్నీమ‌ద్య ఉమ్మ‌డి జిల్లాల్లో ఒక‌టి,రెండు రోజులు హ‌రీష్ రావు ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే, అదీ ఆ మ‌ద్య వచ్చిన వార్త‌ల‌ను కొట్టివేసేందుకు త‌ప్పా… ఇంచార్జీ బాద్య‌త‌లేవీ హ‌రీష్ కు అప్ప‌జెప్ప‌లేద‌ని తెలుస్తోంది. ఉద్య‌మంలో, ఆ త‌ద‌నంత‌రం ఎన్నో క‌ష్ట‌కాలంలో పార్టీని బ్ర‌తికించి, ట్ర‌బుల్ షూట‌ర్ గా ఉన్న ఆయ‌న‌కే ట్ర‌బుల్స్ వ‌చ్చాయంటున్నారు స్థానిక నేత‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *