LRS….ఇది ప్రభుత్వ దోపిడీ కాదా

ఇది ముందు ముక్కు మూసి ….
తరువాత గొంతు కోయడం కాదా …??

ఇది ఏ రాజనీతి ?
స్థలాలు & కట్టడాల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ??

అసలు ఈ LRS స్కీమ్ సహేతుకత ఏమిటీ ?ప్రజల నుండి బలవంతపు డబ్బు వసూళ్లుతప్ప వేరే ప్రయోజనం వుందా …?
ఇది ప్రభుత్వం చేస్తున్న మరో అక్రమం కదా ??

74 ఏళ్లుగా గ్రామ పంచాయతీలు … స్థానిక సంస్థలు మంజూరు చేసిన లేఅవుట్లు అక్రమమా ? ఐతే అక్రమంగా మంజూరు చేసిన వాళ్ళను …ప్రభవులను …ప్రభుత్వాలను శిక్షించారా ?? ఇప్పుడు శిక్షిస్తారా ??

అక్రమమే అయితే …..
రిజిస్ట్రేషన్ శాఖ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు ?
మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ….
విద్యుత్ శాఖవాళ్ళు
వాటర్ వర్క్స్ వగైరా శాఖలు …
ఎలా అనుమతులిచ్చాయి ??

ఇంతకాలం … ఇన్ని ప్రభుత్వాలు “కళ్ళు ఎలా మూసుకున్నాయి ??????”

ఈ LRS,ద్వారా ప్రజల నుండి డబ్బులు బలవంతపు వసూళ్లు చేసి అక్రమాన్ని సక్రమం ఎలా చేస్తారు ?

దొంగను ….. దోరగా చేస్తారా ??
పాపాత్ముణ్ణి … పునీతం చేస్తారా ??

74 ఏళ్లుగా ఈ రిజిస్ట్రేషన్ మరియు ఇతర సంబంధిత రుసుముల రూపేణా ప్రజలు చెల్లించిన డబ్బంతా ప్రభుత్వానికి చేరింది కదా ….???

మరీ కొత్తగా ఇప్పుడు అక్రమం అంటున్నారే ?

“అక్రమం చేసింది …చేస్తున్నదెవరు ?ప్రజలా ..? ప్రభుత్వమా ??”

ఇక ఈ LRS,BRS, రుసుముల వాయింపు కత ఎలా వుందంటే …ఈ ఉత్తర్వును తయారుచేసిన మేధావులను ” ఆర్ధిక నోబెల్ ” బహుమతికి నామినేట్ చెయ్యాలి .,

పేరుకు మాత్రం నామమాత్రం ఫీజులు కానీ….ఎల్.ఆర్.ఎస్. ని ఆశ్రయిస్తే దాదాపు సగం ప్లాటు అమ్ముకోవలసిన దుస్థితి …😥

నామమాత్రపు ఫీజులతో …ప్రతి సామాన్యునికి అందుబాటులో …స్వచ్ఛందంగా
ముందుకు వచ్చి …ఆనందంగా చెల్లించేటుండాలి …..
కానీ …. కాబూలీ వసూలు ఉండొద్దు …!!

ఎప్పుడో కొన్న ప్లాటు కు ఇప్పుడు లక్షలకు లక్షలు కట్టమంటే సామాన్యుడికి ఎలా సాధ్యం?

అరకప్పు ఛాయకు … గుక్కెడు నీళ్లకు ఆరాట పడే సామాన్యునికి ఇది సాధ్యమా ..?

ప్రభుత్వానికి ప్రజాసంక్షేమం …పట్టణ సమగ్ర అభివృద్ధి ధ్యేయం ….(?) అయితే నామమాత్రపు రుసుముతో ఈ LRS, BRS లను నిరంతర ప్రక్రియగా మార్చాలి ….!!

ఎవరికి వీలైన సమయాల్లో వాళ్ళు చేసుకొంటారు..కానీ “ఇప్పుడే కడతారా లేక చేస్తారా ?” అన్నట్లుగా బెదిరింపు …దౌర్జన్యం ఎందుకు …..ఈ కటాఫ్ తేదీలు ఎందుకు ..?

సమాజం లో ఉన్న రెండు శాతం ఆర్ధిక స్తోమతు కల వర్గాల వారికి ఇది వరం అయితే కావచ్చు ……??
కానీ …మిగిలిన 98 % ఆర్ధికంగా బలహీన వర్గాల వారికి శాపం ….!!!

వీళ్లంతా …ఈ ఆదేశాలు అమలు చేసే
పరి స్థితి లో లేరు….వారందరికీ ఇది ఉప్పెన లాంటి జీవన్మరణ సమస్య …..

“ఇది నిస్సందేహంగా ఒక నల్ల చట్టం …”

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరచి ” సామాన్యుని గుండె చప్పుళ్ళు విని …
నల్ల ఆదేశాలను రద్దుచేసి …. ఆ స్థానే …
చల్లని ఆదేశాలను “ఇవ్వాలి .,

ప్రజా ప్రతినిధులు ఈ విషయమై గళం విప్పాలి …. లేదా ప్రజాగ్రహానికి గురికావడం ఖాయం ….

జై తెలంగాణా … జై హింద్ … జై భారత్

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

Suryaprakash Annavajjula

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *