పసుపు బోర్డు కు బదులు స్పైసీ ప్రాంతీయ కార్యాలయం..

MP అరవింద్ గారు గత ఎన్నికల ప్రచారంలొ కాని గెలిచిన తర్వాత కాని ఆయన చెప్పిన మాట ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు మరియు పసుపుకు మద్దతు ధర.

కాని నేడు పియుష్ గోయల్ గారు ప్రకటించింది ప్రత్యేక పసుపు బోర్డు కాదు ఇప్పటివరకూ ఉన్న స్పెస్ బోర్డ్ యొక్క రీజినల్ ఆఫీస్ మత్రమే ఆయన ప్రకటించాడు మాకు ఉన్న సమాచారం మేరకు అది కూడా వరంగల్ లొ ఉన్న ఆఫీస్ ను నిజామాబాద్ కు మర్చుతున్నారు తప్పితే కొత్తగా వారు చేస్తున్నది ఎం లేదు.

అరవింద్ గారు ఇన్ని రోజులు కేంద్రంలొ ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు పంటను స్పెస్ బోర్డులొ కలపడం వల్లె పసుపు పంటకు ప్రాధాన్యం తగ్గింది పసుపు రైతులు నష్టపోయారు పసుపును స్పెస్ బోర్డు నుండి వేరు చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తేనె పసుపు పంటకు మరియు రైతులకు మేలు జరుగుతుంది అని అన్నారు మరి ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రితొ ప్రత్యేక పసుపును స్పెస్ బోర్డ్ నుండి వేరు చేయకుండా అదే స్పెస్ బోర్డ్ రీజినల్ ఆఫీస్ నిజామాబాద్ లొ ఏర్పాటు చేస్తు ప్రకటన చెయ్యడం రైతులను మభ్య పెట్టడమె. అలాగె మద్దతు ధర విషయంలొ ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడం మన MP గారి చేతకాని తనానికి నిదర్శనం. MP గారు స్వయాన చెప్పరు పసుపుకు క్వింటాల్ కి 6000 ఖర్చూ అవుతుంది దానికి 50% కలిపి 9000 మద్దతు ధర ఇవ్వాలని తీర్మానం చేసి పంపాను అని మరి ధర పై ఎటువంటి ప్రకటన లేదు ప్రస్తుతం మార్కెట్లో ధర 4000-5000 మధ్యన పలుకుతుంది. మెం కోరిన ప్రత్యేక పసుపు బోర్డు మాకు కావాలి పసుపుకు 15000 మద్దతు ధర కావాలి. అంతకు మించి ప్రయోజనాలు మాకు అవసరం లేదు. ఇప్పటికైనా MP గారు మాటలతో కాలయాపన చేయడం ఆపి చిత్తశుద్దితొ పసుపు బోర్డు మద్దతు ధరకై క్రుషి చేయాలి. లేకపోతే MP పదవికి రాజీనామా చేయాలి. ఇప్పటికీ మీరు మా పసుపు సమస్యను రాజకీయంగా వాడుకుంది చాలు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *