సంచలనం రేపిన హత్యకేసులో చిన్న క్లూ ఇచ్చిన లక్ష రివార్డ్

సంచలనం రేపిన హత్యకేసులో చిన్న క్లూ ఇచ్చిన లక్ష రివార్డ్ – ప్రకటించిన హైదారాబాద్ పోలీస్.

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన హత్య కేసులో ..ఏ చిన్న క్లూ అందించిన ..లక్ష రూపాయల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు..సైబరాబాద్ పోలీసులు. కొండాపూర్ బోటానికల్ గార్డెన్ వద్ద ముక్కలు ముక్కులగా నరికి గోనా సంచిలో పడేసిన ఘటన పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మృతి రాలు ఎవరో ఇంకా గుర్తించకపోవడంతో…పోలీసులు తాము సేకరించిన కొన్ని ఆధారాలను మీడియాకు రీలీజ్ చేశారు.

ముక్కలు ముక్కలుగా నరకబడ్డ మహిళ నిండు గర్చిణి అని ఇప్పటికే పోస్ట్ మార్టమ్ లో నిర్ధారణ అయ్యింది. ఆమె ఎత్తు 5 అడుగకుల 4 అంగుళాలు. గుండ్రని ముఖం. 30 ఏళ్ల వయస్సు ఉండోచ్చు . శరీర వర్ణం తెలుపు. మృతదేహం పై మెరూన్ రుంగు కుర్తా..రెడ్ కలర్ పైజామా ఉన్నాయి. కాలికి వెళ్లకు వెండి మెట్టలు ఉన్నాయి. వేలికి రాగి ఉంగరం ఉంది. మెరూన్ రంగు పగిలిచన గాజులు ఉన్నాయి. మృతురాలు ఉత్తరాదికి చెందిన మహిళగా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమెను హత్య చేసిన వ్యక్తి హోటల్, రెస్టారెంట్..లేదా హోల్ సేల్ కిరాణ షాపు..సూపర్ మార్కెట్ లో పనిచేసే వ్యక్తి గాని..నిర్వాహకుడి గాను అనుమానం. ఎందుకంటే మృతదేహన్ని ముక్కలుగా నరికిన తర్వాత ఆ శరీర బాగాలను చుట్టడానికి ఉపయోగించిన వస్తువుల ఆధారంగా పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. గుంటూరుకు చెందిన అంకూర్ బ్రాండ్ కారపు పొడి కవరు..స్పైసెస్ ఆప్ 24 క్యారెట్స్ అనే కంపెనీకి చెందిన సంచి … అర్చన ప్లోర్ మిల్స్ లెబుల్ ఉన్న గోతాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

తమ ఇంటి పక్కల ఉండే ఎనిమిది నెలల గర్బిణి స్త్రీ కనిపించకపోయినా…తాము పేర్కోన్న ఆధారాలు గుర్తించిన వారు ఈ క్రింది నెంబర్లకు సమాచారం ఇస్తే లక్ష రూపాయలు ఇస్తామని సైబరబాద్ కమీషనర్ ప్రక్రటించారు.
పోన్ నెంబర్లు.. ఎస్సై నెంబరు 9491030375, సిఐ 9499617127, పోలీస్ స్టేషన్ గచ్చి బౌలి పీఎస్ 9491030378, ఏసిపి 9491039175, డీసీపీ 9490617201

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *