Polytricks.in

కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న పింకీలు.. సోషల్ వెల్ఫేర్‌ స్టూడెంట్స్‌పై అవాకులు చెవాకులు

కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ఎప్పుడూ ముందుంటారు బీఆర్ఎస్ నేతలు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించిన మెస్సీ ఫుట్‌ బాల్ మ్యాచ్‌తో రాజకీయాలు చేస్తూ వికృతానందం పొందుతున్నారు. మట్టిలో మాణిక్యాల్లాంటి సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఏకంగా ప్రపంచ దిగ్గజ ఆటగాడితో కలిసి గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడితే ఓర్చుకోలేకపోతున్నారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగుతూ…వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. మెస్సీ రాక సందర్భంగా అంతర్జాతీయ మీడియా మొత్తం తెలంగాణవైపు చూసి అబ్బురపడుతుంటే..బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌పై లేనిపోని తప్పుడు ప్రచారాలతో తెలంగాణకు వచ్చిన మంచి పేరును చెడగొడుతున్నారు.

ది గోట్ ఇండియా టూర్ పేరిట దేశంలోని పలు నగరాల్లో మెస్సీతో పాటూ మరో ఇద్దరు ఫుట్‌బాల్‌ ప్లేయర్లు పర్యటిస్తున్నారు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ టూర్ సాగింది. తొలుత కోల్‌కతాలో జరగాల్సిన మ్యాచ్‌ అక్కడి నిర్వాహకుల వైఫల్యం వల్ల గందరగోళంగా ముగిసింది. దీంతో ముందుజాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రతతో మెస్సీ హైదరాబాద్‌ టూర్‌ను విజయవంతం చేశారు. దీంతో మెస్సీ మేనేజర్‌తో పాటూ ఆయన బృందం తెలంగాణ యంత్రాంగంపై ప్రశంసలు కురిపించింది. ఇది చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మెస్సీ మ్యాచ్‌కోసం వందలకోట్ల ప్రజాధనం వృథా చేశారని తొలుత తప్పుడు ప్రచారాన్ని నడిపించింది. అయితే ఇదంతా ప్రైవేట్‌ కార్యక్రమని తేలిపోవడంతో..మరో విషప్రచారానికి తెరతీసింది. ఈ మ్యాచ్‌లో ఆడినవారంతా రాజకీయ నాయకుల వారసులే అంటూ గోబెల్స్ ప్రచారానికి పదును పెట్టింది. అయితే ప్రభుత్వానికి మంచిపేరు రావొద్దనే వారి అత్యుత్సాహంతో..ఎంతో ప్రతిభ ఉన్న సోషల్ వెల్ఫేర్ విద్యార్ధులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జీవితకాలానికి కావాల్సిన అనుభూతుల్ని, ఉత్సాహాన్ని అందించిన మ్యాచ్‌లో పాల్గొన్న సాంఘీక సంక్షేమ కళాశాలల విద్యార్ధులు ఇప్పుడు సోషల్ మీడియా వెకిలి పోస్టులకు బలి అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్ ఆడి గెలిచిన విద్యార్ధులు…బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలతో డీలా పడిపోయారు. కోట్లమందిలో కొందరికే వచ్చే అవకాశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తమకు కల్పిస్తే..దాన్ని ఓర్వలేకపోతున్నారని వాపోతున్నారు.

నిజానికి ప్రైవేట్ కంపెనీ నిర్వహించిన కార్యక్రమం కావడంతో సహజంగానే స్పాన్సర్స్‌ వారికి ఇష్టం వచ్చిన వారికి అవకాశం కల్పిస్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రత్యేక క్షణాలను సోషల్ వెల్ఫేర్ విద్యార్ధులకు అందించారు. సింగరేణి జట్టుకు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తూ…సోషల్ వెల్ఫేర్ పిల్లలకు కూడా ఆ టీమ్‌లో చోటు కల్పించారు. అంతేకాదు వారితో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇదంతా కేవలం ఆ ఒక్క జట్టుకు మాత్రమే కాదు..మొత్తం తెలంగాణలోని ప్రతి క్రీడాకారుడికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. క్రీడలకు ప్రోత్సాహం ఇస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు…నేరుగా గ్రౌండ్‌లోకి దిగి స్పోర్ట్స్‌ను ప్రేమించే ప్రతి క్రీడాకారుడికి జోష్‌ అందించారు సీఎం రేవంత్ రెడ్డి. గడిచిన 15 నుంచి 20 రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా స్పోర్ట్స్ గురించే చర్చ. ఇలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా తెలంగాణలో క్రీడలకు ఏనుగంత బలాన్ని ఇచ్చింది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు.

Exit mobile version