Site icon Polytricks.in

తెలంగాణలో పవర్ ఫుల్ పొలిటిషియన్ ఎవరో తెలుసా?.. గూగుల్ ఆన్సర్ ఇదే!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ తెలంగాణలో రాజకీయాలు అంతకంతకూ సెగలు రేపుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య డైలాగులు డైనమేట్లలా పేలుతున్నాయి. ఎవరికివారు పొలిటికల్ రేసులో ముందు ఉండేందుకు మాటలని మిస్సైళ్లలా ప్రయోగిస్తున్నారు. మరి ఈ పోటీలో ఎవరు ఎక్కడ ఉన్నారు? రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరై ఉంటారని ప్రజలు భావిస్తున్నారు? అనే ప్రశ్నలు రాజకీయ పరిశీలకుల్లో తలెత్తకమానవు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. నేటి తరం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేది గూగుల్ లోనే.

మరి తెలంగాణలో పవర్ ఫుల్ పొలిటిషియన్ ఎవరు అంటే.. గూగుల్ ఎవరి పేరు చెబుతుందో తెలుసా?.. రేవంత్ రెడ్డి అని.. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు రేవంత్ రెడ్డి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా.. ఇప్పుడది వైరల్ గా మారింది. దటీజ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ టైగర్.. ఇదీ రేవంత్ చరిష్మా అంటూ.. ఆయన అభిమానులు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.

Exit mobile version