Polytricks.in

తండ్రి ఫామ్‌హౌజ్‌లో…కొడుకు జైలుకు.. ఇక బీఆర్ఎస్ కథ కంచికేనా..?

ఫార్ములా ఈ కార్ రేస్‌ స్కాంలో కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్నాళ్లూ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూసిన ఏసీబీకి గ్రీన్‌ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ అనుమతితో చార్జిషీట్ ఫైల్ చేయనుంది ఏసీబీ. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ స్కాంలో కేటీఆర్ నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ అధికారులకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. తనకేమీ సంబంధం లేదు..ఇదంతా అధికారులు తీసుకున్న నిర్ణయమే అని కేటీఆర్ బుకాయించారు. అసలు అది కేసే కాదు..అందులో తనకేమీ కాదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణంలో తీగ లాగి డొంకను బయటపెట్టారు. అనుమతులు లేకుండా కోట్ల రూపాయలు విదేశాలకు తరలించడంపై పక్కా ఆధారాలను ఇప్పటికే రెడీ చేశారు.

చార్జిషీట్ త్వరలోనే రెడీ అవడం ఖాయంగా కనిపిస్తుండంలో కేటీఆర్‌ శిబిరంలో కొత్త చర్చ మొదలైంది. అసలే పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఒకవైపు వరుస ఓటములు…మరోవైపు అగ్రనేతల కుంభకోణాలతో పార్టీ ఉంటుందా? మూసేస్తారా? అని చర్చించుకుంటున్నారు. కవితను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టిన తర్వాత బీఆర్ఎస్‌లో నాయకుల్లో నమ్మకం మరింత సడలింది. ఆమె ఆరోపించినట్లు పార్టీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమే అని చర్చించుకుంటున్నారు.

ఒకవైపు తనకేమీ పట్టనట్లు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవ్వడం..కనీసం పార్టీ నిర్మాణంపై కనీసం శ్రద్ధ పెట్టకపోవడంతో విలీనం నిజమేనని నిర్ధారణకు వస్తున్నారు. పైగా కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగోలేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి తోడు ఆయన రెండుమూడు సందర్భాల్లో కనిపించినప్పుడు వయోభారం కనిపించింది. మరోవైపు కేటీఆర్ చుట్టూ అవినీతి కేసులు, వరుస ఓటములు ఉన్నాయి. ఇక హరీష్‌రావు తనవర్గాన్ని తయారు చేసుకొని బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. ఇలా ఎవరి దారి వాళ్లు చూసుకోవడంతో 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానానికి ముగింపు పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.

Exit mobile version