Site icon Polytricks.in

శుభ్ మన్ సూపర్ ఇన్నింగ్స్ – టీమిండియా విక్టరీ

మొన్నటి వరకు అతను వన్డేలకు పనికి రాడండి అన్నారు. కివీస్ తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించాక.. వన్డేలకు ఒకే కాని టీ20లకు సరితూగాడని అభిప్రాయాలు వినిపించారు. ఇది నిన్నటి వరకు టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ గురించి స్పోర్ట్స్ ఎనలిస్టుల అభిప్రాయం. కాని వాటన్నింటికి బుధవారం కివీస్ తో జరిగిన మూడో టీ20ద్వారా గట్టి సమధానమే ఇచ్చి తనేంటో రుచి చూపించి..అందరి నోళ్ళ మూయించాడు గిల్. కళాత్మక ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. సిక్స్, ఫోర్లతో మైదానం నలువైపులా గిల్ పరుగుల వరద పారించాడు. విమర్శలు అందుకున్న నోటి నుంచే ప్రశంసలను అందుకున్నాడు.

సీరిస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా అల్ రౌండర్ ప్రదర్శనతో ఆదరగోట్టింది. బుధవారం జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ పై 168పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 234పరుగులు చేసింది.

 

ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ (126 నాటౌట్ 12*4, 7*6 ) పొట్టి ఫార్మాట్ లో తనదైన ముద్రవేసి టీ 20లో మొదటి శతకం నమోదు చేశాడు. మొదట్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయినా ఏమాత్రం ఒత్తిడి లోను కాకుండా రాహుల్ త్రిపాఠి, శుమన్ గిల్ ఇన్నింగ్స్ ను నడిపించారు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ తలో చేయి అందించారు.

ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ టీమిండియా పేసర్ల ధాటికి ఒక్కొక్కరు పెవిలియన్ కు క్యూ కట్టారు. లక్ష్య చేధనలో ఆ జట్టు 12.1ఓవర్లలో కేవలం 66పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఏ దశలోనూ టీమిండియాకు పోటీ ఇవ్వలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4/16), అర్షదీప్ సింగ్ (2/16), ఉమ్రాన్ మాలిక్ (2/9), శివం మావి (2/12)లు సత్తా చాటారు.

కొండంత లక్ష్యం ఉన్నపటికీ కివీస్ బ్యాటింగ్ ఇలా పేకమేడలా కూలుతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అద్భుతమైన బ్యాటింగ్ లైనఫ్ ఆ టీం సొంతం. భారీ హార్డ్ హిట్టర్లు ఉన్నా జట్టు బరిలోకి దిగాక కనీసం పోరాటపటిమ కూడా చూపలేకపోయింది. మూడు ఓవర్లకే ఆ జట్టు ఓటమి ఖాయమైంది. ఎ పిచ్ పై అయితే కివీస్ బౌలర్లు చేతులెత్తేశారో అదే పిచ్ పై టీమిండియా బౌలర్లు హడలెత్తించారు. ఫీల్డింగ్ లో కూడా అద్భుతంగా రాణించారు.

 

సూర్య పట్టిన రెండు క్యాచ్ లు మ్యాచ్ లో హైలెట్ గా నిలిచాయి. గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్ లో హహ్వ అనిపించాయి.కివీస్ ఇన్నింగ్స్ లో శాంట్నర్ (13), మిచెల్ (35)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు తప్ప మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.

మ్యాచ్ హైలెట్స్ కోసం ఇక్కడ చూడండి 

Exit mobile version