Site icon Polytricks.in

టీడీపీని జనసేన కోరిన సీట్లు ఇవేనా..?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. అందుకే వైసీపీ నేతలు నోటికి పని చెప్తున్నారు. పొత్తు కోసమే ఈ భేటీ జరిగిందంటూ మాట్లాడేస్తున్నారు. అంతేకాదు.. టీడీపీని జనసేన అడిగిన సీట్లు ఇవేనంటూ ప్రచారం చేస్తున్నారు.

వైసీపీ చెబుతున్న ప్రకారం -టీడీపీని జనసేన కోరిన సీట్లు ఇవేనట

వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న ఈ ప్ర‌చారంపై జ‌న‌సైనికులు స్పందించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ భేటీలో వైసీపీ నేత‌లు ఏమైనా కూర్చున్నారా ? లేక ప‌వ‌న్ కళ్యాణ్ వైసీపీ నేత‌ల చెవిలో ఏమైనా చెప్పారా ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ, జ‌న‌సేన క‌లిస్తే వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని ఈ ప్రచారానికి తెరలేపారని మండిపడుతున్నారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌తి స‌మావేశంలోనూ 175 సీట్లు గెలుస్తామ‌ని ప్ర‌క‌టిస్తారు. అధికారంపై అంత ధీమా ఉన్న‌ప్పుడు జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు పై ప‌డి ఏడ్వ‌డం ఎందుక‌ని ప్రశ్నిస్తున్నారు.

Also Read : టీడీపీ- జనసేన పొత్తు పొడుస్తుందా- పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నారు..?

Exit mobile version