Site icon Polytricks.in

హీరో విశాల్ గుండెలపై టాటూ – ఎవరిదో తెలుసా..?

మనం విపరీతంగా అభిమానించే వ్యక్తుల పేర్లు, ఫోటోలను మన హృదయాలపై ముద్రించుకోవాలని అనుకుంటాం. అందుకోసం ప్రత్యేకంగా టాటూ వేయించుకొని అభిమానం చాటుకుంటాం.

నచ్చిన హీరో, హీరోయిన్ ల ఫోటోలను శరీర భాగాలపై ముద్రించుకుంటాం. కాని ఓ హీరో తనకు నచ్చిన ఓ లెజెండరీ నటుడు , మాజీ ముఖ్యమంత్రి ఫోటోను తన గుండెలపై పొడిపించుకున్నారు.

ఇంతకీ అతను ఎవరనేగా మీ సందేహం. తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్. తన అభిమాన హీరో ఎంజీఆర్ ఫొటోను గుండెలపై పొడిపించుకుని అభిమానం చాటుకున్నాడు.

ఎంజీఆర్‌ను విపరీతంగా అభిమానిస్తుంటారు విశాల్. ఆ ఇష్టం, ప్రేమతోనే విశాల్ గుండెలపై ఏంజీఆర్ ఫొటోను పొడిపించుకున్నారని అర్థం అవుతుంది.

ఇదిలా ఉండగా.. విశాల్ ఈ మధ్య కాస్త నేమ్మదించారు. ఆయన ఇటీవలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తెలుగు. తమిళ్ రెండింట్లో ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలోతన తరువాతి చిత్రంతో హిట్ కొట్టాలని కసిమీదున్నారు విశాల్.

మరి తరువాతి చిత్రంతోనైనా సక్సెస్ అవుతారా.? లేదో చూడాలి.

Also Read : ఇంట్రెస్టింగ్- హీరోగా దర్శకధీరుడు రాజమౌళి..!

Exit mobile version