Polytricks.in

తారకరత్న హెల్త్ కండిషన్ సీరియస్..!

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు బెంగళూరు హృదయాలయ వైద్యులు. ఈమేరకు ఆసుపత్రి వైద్యులు తారకరత్నకు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.

ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యాన్ని కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌, ఇతర స్పెషలిస్ట్‌లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తారకరత్నకు చికిత్స కొనసాగుతుందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

శుక్రవారం నారా లోకేష్ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఆకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు.

Also Read : తారకరత్న పరిస్థితి విషమం- బెంగళూర్ కు తరలింపు..?

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల ప్రకటనతో అభిమానులు ఒక్కసారిగా శోకసంద్రం లో మునిగిపోయారు..ఎలా అయినా తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో మా ముందుకి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు..నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version