Site icon Polytricks.in

తారకరత్న పెద్దకర్మలో జూ. ఎన్టీఆర్ ని అవమానించిన బాలయ్య

తారకరత్నపెద్దకర్మను నందమూరి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ పెద్దకర్మలో తారకరత్న ఫోటోను చూసి ఆయన భార్య కుమిలికుమిలి ఏడ్చింది. ఈ సందర్భంగా అక్కడున్న నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆమెను చూసి కంటతడి పెట్టారు.

తారకరత్న పెద్దకర్మలో పాల్గొనేందుకుగాను జూనియర్ ఎన్టీఆర్ RRRఅంతర్జాతీయ అవార్డ్స్ ఫంక్షన్స్ కు కూడా హాజరు కాలేదు. అయితే.. ఈ పెద్దకర్మలో పాల్గొన్న ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లను బాలయ్య వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగా లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి తారకరత్న పెద్దకర్మ కి ఎన్టీఆర్ హాజరయ్యారు. అయితే ఇక్కడ బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ పట్ల ప్రవర్తించిన తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి తో ఉన్నారు. బాలయ్య తమవైపు వస్తున్న వీళ్లిద్దరు ఆయనని గౌరవిస్తూ పైకి లేచారు. కానీ బాలయ్య మాత్రం పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందర్నీ పలకరించిన బాలయ్య వీరిద్దరిని మాత్రం అస్సలు పలకరించలేదు.

అంతే కాదు ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ని బాలయ్య పలకరించలేదట. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి ఫ్యామిలీలో ఓ రకమైన ఈర్ష్య ఉంటుందని.. ఇది మరోసారి బయటపడిందని అంటున్నారు.

Exit mobile version