Site icon Polytricks.in

కుటుంబంతో విడిపోయిన సూర్య – దుఃఖసంద్రంలో జ్యోతిక

హీరో సూర్య. ఓ స్టార్ హీరోగానే కాకుండా ఆయన్నువ్యక్తిగతంగా చాలామంది అభిమానిస్తుంటారు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ సూర్యకు ఫ్యాన్స్ ఉన్నారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. సామజిక సేవా కార్యక్రమాల్లో కూడా సూర్య ముందుంటారు. అందుకే దక్షిణాదిన సూర్యకు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది.

2006లో తాను ఎంతగానో ప్రేమించిన ప్రముఖ హీరోయిన్ జ్యోతికను వివాహం చేసుకున్నారు సూర్య. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రశాంతమైన జీవితం గడుపుతోన్న సూర్య కుటుంబం గురించి కోలీవుడ్ లో జరుగుతోన్న ఓ ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

సూర్యది ఉమ్మడి కుటుంబం. తన భార్యా పిల్లలతోపాటు , తన తమ్ముడు కార్తీ భార్యాపిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి 20ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇలా ఉమ్మడి కుటుంబంగా ఉండటానికి కారణం మా వదిన ( జ్యోతిక) నేనని కార్తీ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల ఈ ఉమ్మడి కుటుంబం విడిపోయింది. సూర్య తన భార్యాపిల్లలతో కలిసి సెపరేట్ గా ఉంటున్నాడట. ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి చెన్నైకి వస్తు షూటింగ్ లకు హాజరు అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

సూర్య కుటుంబంలో విబేధాలు రావడానికి ఆయన తండ్రి శివ కుమారే కారణమని అంటున్నారు. జ్యోతిక తిరిగి సినిమాలలో నటించాడని శివ కుమార్ వ్యతిరేకిస్తున్నాడని.. ఈ విషయంలో సూర్య- శివ కుమార్ ల మధ్య విబేధాలు వచ్చాయని అంటున్నారు.

గత కొంతకాలంగా తరుచుగా ఈ విషయమై గొడవలు అవుతుండటంతో సూర్య కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని టాక్. ఉమ్మడి కుటుంబంలో కలహాలు రావడంతో జ్యోతిక తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని అంటున్నారు.

Exit mobile version