Site icon Polytricks.in

బిగ్ న్యూస్ – కేసీఆర్ కు సర్వే ఫియర్..!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రోజరోజుకి హీటెక్కుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపించ‌డంతో ప్ర‌ధాన పార్టీలు స‌భ‌లు, బ‌హిరంగ స‌భ‌లు, పాద‌యాత్ర‌ల‌తో దూకుడు పెంచుతున్నాయి. నిజానికి ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది ఉన్నప్ప‌టికి ముంద‌స్తు దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ కనుక ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే కర్నాటకతోపాటు ఎన్నిక‌లు రానున్న‌ట్లు తెలుస్తోంది.

ముంద‌స్తుకు వెళ్లినా కేసీఆర్‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు…

అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడు. కానీ ముంద‌స్తుకు వెళ్లినా కేసీఆర్‌కు ఈసారి ఓట‌మి త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు చెప్పుకొస్తున్నారు. ప్ర‌ధానంగా కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త తీవ్రంగా పెరిగింది. మెజార్టీ ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ అవ‌లంభిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాలు, ఇచ్చిన హమీలు అమ‌లులో కేసీఆర్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌లో వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంది. కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు, భూదందాల ఆరోప‌ణ‌ల‌తో ప‌లువురు ఎమ్మెల్యేలు ఉంటే.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలేమో నియోజ‌క‌ర్గాల‌ను ప‌ట్టించుకున్న పాపాన లేదు. ఇలా ఏ కోణంలో చూసిన ఎమ్మెల్యేల‌పై తీవ్ర నిరాశ‌తో ఉన్నారు ప్ర‌జ‌లు. దీనితో ఈ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

అన్ని స‌ర్వేల్లో కేసీఆర్‌కు నిరాశే..

స‌ర్వే ఏజెన్సీల‌న్ని కేసీఆర్‌కు నిరాశ‌నే క‌ల్పిస్తున్నాయి. చాలా వ‌ర‌కు స‌ర్వేల్లో కేసీఆర్ పాల‌నపై వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు చెప్పుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌శాంత్ కిషోర్ నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా కేసీఆర్ న‌మ్మ‌లేని నిజాలు విన్న‌ట్లు స‌మాచారం తెలుస్తోంది. పీకే నిర్వ‌హించిన సిక్రెట్ స‌ర్వేలో 80 శాతం ఎమ్మెల్యేలు గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని తెల్చిచెప్పాడు. దీనితో కేసీఆర్‌కు భ‌యం ప‌ట్టుకుంద‌ని, ముంద‌స్తుకు వెళ్ల‌డం కూడా ఈ భ‌యంతోనేన‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఏది ఎమైన‌ప్ప‌టికి ముచ్చ‌ట‌గా ముడోసారి గెల‌వ‌ల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ప్ప‌టికి.. ప్ర‌జ‌లు మాత్రం కేసీఆర్‌ను ఇంటికి పంపాల‌ని రెడీగా ఉన్నారు.

Exit mobile version