Site icon Polytricks.in

రాహుల్ గాంధీకీ ఊరట నిచ్చిన సూరత్ సెషన్స్ కోర్టు?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు కొంత ఊరటనిచ్చింది. మోడీ ల వంశస్తులను కించపరిచిన నేరానికిగాను రెండు ఏళ్ళు జైలు శిక్ష విదిస్తూ సూరత్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. పై కోర్ట్ కు వెళ్ళడానికి ౩౦ రోజుల గడువు కూడా ఇచ్చింది. అయితే ఆ గడువును పెంచుతూ ఈ రోజు సూరత్ సెషన్స్ కోర్టు కొంత ఊరటనిచ్చింది.

బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో జ్యుడీషియల్స్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. కోర్టు పిటిషన్ పై విచారణ జరిపి ఈ మేరకు బెయిల్‌ పొడిగించింది.

పిటిషన్ పై విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. 2013 కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే దీని మీదా దేశ వ్యాప్తంగా పలు విమర్శలు వచ్చాయి. చివరికి అమెరికా కూడా స్పందించి మోడీని సున్నితంగా మందలించి, రాహుల్ గాంధీకి పరోక్షంగా అండగా నిలుచుంది. ఈ పరిణామాలు అన్ని రాహుల్ గాంధీకి కలిసివచ్చాయి అని చెప్పొచ్చు.

Exit mobile version