Site icon Polytricks.in

విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కండిషన్ సీరియస్ గానే ఉందని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి.

కృష్ణ గారికి.. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో ఎమర్జెన్సికి తరలించి సీపీఆర్ చేశాం. ఆ తరువాత కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకొచ్చారు. అనంతరం ఐసీయూకు తరలించి వెంటిలెటర్ పై ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇప్పటికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనను కోలుకునేలా అత్యుత్తమ వైద్యం అందిస్తున్నాం. మరో రెండు రోజులపాటు కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎంటన్నది ఏమి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.

Exit mobile version