Site icon Polytricks.in

చావు బతుకుల మధ్య సూపర్ స్టార్

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. కొంతకాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. కరోనా సమయంలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి పరిస్థితులను పూర్తిగా తట్టుకొని అనారోగ్య సమస్యల నుంచి కృష్ణ బయటపడ్డారు. అయినప్పటికీ తాజాగా మరోసారి అనారోగ్యం తిరగబెట్టింది. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ లో ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన పూర్తిగా కోలుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

కాసేపటి క్రితమే మహేష్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆయన అనారోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆసుపత్రి వైద్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరించనున్నారు.

Exit mobile version