Site icon Polytricks.in

సోనియా గాంధీ ఆరోగ్యం విషమం? ఆస్పత్రిలో అసలు ఏం జరుగుతోంది?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం కొచం ఆందోళన కరంగా ఉన్నదని ఆమెను ఈ రోజు ఉదయం  ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో  చేర్పించారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఛెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా గాంధీని పర్యవేక్షిస్తోంది. అనుకోకుండా ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు ఈ ఆసుపత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

ఆమెను పరిశీలిస్తున్నామని, పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. కాబట్టి ఎవ్వరు ఆందోళన చెందరాదని భరోసా ఇచ్చారు. సాయంకాలం ఆమె హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని డాక్టర్ లు తెలిపారు.

Exit mobile version