Site icon Polytricks.in

ముద్దు పెడితే తప్పేంటి – ట్రోల్స్ పై శ్రియా రియాక్షన్

దృశ్యం 2రిలీజ్ సందర్భంగా నటి శ్రియా ఆమె భర్తతో వ్యహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అందరూ చూస్తుండగానే లిప్ కిస్ పెట్టుకోవడం తీవ్ర దుమారానికి తావిచ్చింది. ఇండియాలో ఫారిన్ కల్చర్ ను ప్రవేశ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో శ్రియ తీరును తప్పుబట్టారు.

దీనిపై శ్రియ స్పందించింది. నా ప్రత్యేక క్షణాల్లో కిస్ చేయడం సాధారణమైన చర్య తను ముద్దు పెట్టాడు. నా వరకు ఇది క్రేజీ ఫీలింగ్. సహజంగా జరిగే చర్యలను ట్రోల్ చేయడం ఎందుకన్నది మా వారికీ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది.

అయినా తనపై చేస్తోన్న చెత్త కామెంట్స్ కు సమాధానం ఇవ్వనని శ్రియ తెలిపింది. ట్రోల్స్ చేయడం అది వారి డ్యూటీ. వాటిని పట్టించుకోకపోవడం నా ఉద్యోగమంటూ.. నేను ఏం చేయాలనుకుంటే అది చేసేస్తానని వ్యాఖ్యానించింది.

తాను నటించిన సినిమాలపై ఆండ్రీ రియాక్షన్ ఏమిటని అడగ్గా.. తన సినిమాలను ఎంతో ఇష్టపడతాడని చెప్పింది. మరోసారి వాటిని చూసి సరిగ్గా అర్థం చేసుకోవాలన్నది అతడి అభిప్రాయమని తెలిపింది.

Exit mobile version