Site icon Polytricks.in

గవర్నర్ కు మళ్ళీ అవమానం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు అవమానాలే స్వాగతం పలుకుతున్నాయి. ఆమె పర్యటనలో అధికారులు ఎవరూ ప్రోటోకాల్ పాటించడం లేదు. ఇప్పటికే ప్రోటోకాల్ విషయంలో తనను అవమానిస్తున్నారని గవర్నర్ పదేపదే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా..అధికారుల తీరు మాత్రం మారడం లేదు.

తాజాగా సిద్ధిపేట జిల్లా పర్యటనలోనూ తమిళిసైకి అవమానం ఎదురైంది. జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ ను జిల్లా కలెక్టర్, ఎస్పీ , ఇతర ఉన్నాతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్ళినా గవర్నర్ కు అధికారులు ఎవరూ స్వాగతం పలకలేదు. డీఆర్వో , ఆలయ అర్చకులు మినహా ఎవరూ తమిళిసైకి స్వాగతం పలకకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం , గవర్నర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుండటంతో సర్కార్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే అధికారులు గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని తెలుస్తోంది.

Exit mobile version