సొమ్ము సింగరేణిది – సోకు కోనేరు కోనప్ప గారిది / పాల్వాయి హరీశ్ బాబు ప్రెస్ మీట్

కాగజ్ నగర్ లోని ప్రజా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు చేసిన *మధ్యాహ్న భోజన కుంభకోణం – DMF నిధుల దుర్వినియోగం* పై మాట్లాడిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా పాల్వాయి హరీష్ బాబు.

కోనేరు చారిటబుల్ ట్రస్ట్ మధ్యాహ్న భోజనం పేరుతో ఒక భారీ కుంభకోణానికి పాల్పడింది.

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు 2014 వ సంవత్సరం నుంచే నియోజక వర్గంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం సొంత ఖర్చులతో పెడుతున్నానని గొప్పలు చెప్పడం అవాస్తవం. దీంట్లో భారీ కుంభకోణం దాగి ఉంది.

సొమ్ము సింగరేణిది-సోకు కోనేరు కోనప్ప గారిది.

2019 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు 3 నెలల కాలంలో  *రూ.24,25,500-00* DMF నిధులను మధ్యాహ్న భోజనం పేరుతో దారి మళ్లించారు. కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా మధ్యాహ్న భోజనానికి DMF నిధులు వినియోగిస్తున్నామని చెప్పలేదు. తన సొంత ఖర్చులు అని చెప్పారు.

DMF నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు.

DMF నిధులు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇచ్చారు?

కోనేరు చారిటబుల్ ట్రస్ట్ కు ఇస్తే ట్రస్ట్ పేరిట చెక్ ఇవ్వాలి గాని TRS నాయకుల పేరిట చెక్కులు ఎలా ఇచ్చారు అనేది చెప్పాలి.

ఎమ్మెల్యే గారు మేము అన్నం పెడితేనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మంచి ఫలితాలు వచ్చాయి అని చెప్పి ఢంకా బజాయించే బదులు ఈ విషయంలో సమాధానం చెప్పాలి. *మీరు అసలు ప్రభుత్వ నిధులు తీసుకున్నారా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలి?*

కోనేరు ట్రస్ట్ మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వ నిధులు ఒక అంశం అయితే ఇంకో పార్శ్వం DMF నిధుల దుర్వినియోగం.

సింగరేణి సంస్థ తన CSR నిధుల్లో 80% నాలుగు జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలకు ఖర్చు  పెట్టాలి.

100కోట్ల నిధులు DMF కమిటీ దగ్గర ఆగి ఉన్నాయి.

ఇప్పటి కలెక్టర్ గారు DMF నిధుల వినియోగం పై స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టే ఆయనను బదిలీ చేయించే కుట్ర చేస్తున్నారు ఈ నాయకులు.

అసలు పనులు చేయకుండా,పాత పనులకు కొత్త బిల్లులు ఎత్తి DMF నిధులు దుర్వినియోగం చేస్తున్నారు.

సింగరేణి ఇచ్చే DMF నిధుల దుర్వినియోగం పై ప్రజల్లో చర్చ జరగాలి – సమగ్ర విచారణ జరపాలి.

ఈ నిధుల దుర్వినియోగం పైన CAG మరియు AG గారికి లేఖలు రాస్తామని అన్నారు. సమగ్ర విచారణ చేస్తే DMF నిధుల దుర్వినియోగం బట్టబయలు అవుతుంది.

ప్రజలకు ఉపయోగపడాల్సిన, గిరిజనులకు ఉపయోగ పడాల్సిన నిధులను ఎమ్మెల్యేలు పక్క దారి పట్టించి సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

2015 నుండి 2020, 5 సంవత్సరాలకు సంబంధించి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన DMF నిధులు ఎన్ని? ఖర్చు పెట్టినవి ఎన్ని? దుర్వినియోగం అయినవి ఎన్ని? వీటన్నింటి లెక్కల గుట్టు విప్పుతాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, షబ్బీర్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు యూనుస్ హుస్సేన్, కార్యకర్తలు ఇర్ఫాత్, యూనుస్, యూసుఫ్, షేరు పఠాన్, పొన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *