కాళేశ్వరం వాస్తవాలు

1.కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మెడిగడ్డ నుండి లిఫ్ట్ చేసే నీళ్ళు 130-140 TMC లు మాత్రమే: TRS ప్రభుత్వం చెప్పేది 185-190 TMC అని ప్రచారం చేస్తున్నారు.

kaleshwaram facts

2. ఈ కాళేశ్వరం లో రివర్స్ పంపింగ్ వల్ల విద్యుత్ అధికంగానే వాడాలి అని విద్యాసాగర్ గారు క్లియర్ గా చెప్పిన్రు.

3. విద్యాసాగర్ గారు తుమ్మడిహట్టి కాడ ఎందుకు కట్టలేదు ప్రాజెక్ట్ అని అడిగితే అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అని చెప్పిన్రు మరి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తమ్మడిహట్టి అక్కడ అన్ని నీళ్ళు లేవు అని కొత్త నాటకం కి తెరలేపింది.

4. వీడియో లో చివరగా విద్యాసాగర్ గారు ఈ ప్రోజెక్టు పూర్తి అయితే వచ్చే ఆయకట్టు 16.4 లక్షల ఎకరాల అని చెప్పిన్రు. మరి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 38 లక్షల ఎకరాల ఆయకట్టు పారుతది అని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ( ఒక్కసారు TRS ప్రభుత్వం చెప్పిన ప్రకారమే లెక్క కడదాo… standared లెక్కల ప్రకారం 1 TMC నీటితో 10,000 ఎకరాలు ఆయకట్టు పరుతది. TRS ప్రభుత్వం 186 TMC లు లెక్క చెప్తున్నారు దాన్లో హైద్రాబాద్ కి 30TMC లు, పరిశ్రమలకు 16TMC లు, మిషన్ భగీరథ కి 10టీఎంసీలు , ఆవరి ఐపోయేంది 10 టీఎంసీలు.మొత్తం 66 TMC పోను మిగిలేది 120 TMC లు. అంటే 120 TMC లతో పారే ఆయకట్టు 12 లక్షలు మాత్రమే. మరి TRS ప్రభుత్వం 38 లక్షలు ఎకరాలు అని ప్రజలను మోసం చేస్తున్నది. ఈ వాస్తవాలు ప్రజలు గమనించాలి.)

మిత్రులరా తెలయని వాళ్లకు తెలిసే విదంగా తెలియ చెప్పండి. ప్రభుత్వం అబద్దాలు తిప్పికొట్టండి. ఇది కాళేశ్వరం redesign చేసిన స్వర్గీయ విద్యాసాగర్ గారు స్వయాన కాళేశ్వరం గురుంచి చెప్పిన విషయాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *