హరిత హారం దోపిడీ నీ బయట పెట్టిన RTI
హరిత హారం గురించి నేను RTI కోరగా ఇచ్చిన వివరాలు…
👉తెలంగాణ రాష్ట్రంలో 2015 లో హరిత హారం ప్రారంభించారు.
👉2015 నుండి 2020 వరకు నాటిన మొక్కలు 159.668cr.
👉నర్సరీలకు వివిధ(Forest,RD dept, ITDA Dept,DRDA,HMDA,Horticulture) department ల నుండి పెట్టిన ఖర్చు 972.98 కోట్లు .
👉 2015 నుండి 2020 వరకుమొక్కలు నాటటానికి అయిన ఖర్చు 1306.55 కోట్లు
👉నర్సరీ లో మొక్కలు పెంచడానికి, మొక్కలు నాటటానికి అయిన మొత్తం ఖర్చు 2279.53 కోట్లు.
👉MGNREGS, Afforestation fund, CAMA..నుండి ఖర్చు చేసినది 1701.56 కోట్లు
👉2015 నుండి 2020 వరకు TKHH కింద మొక్కలు నాటటానికి రూరల్, Forest,HMDA,GHMC ల నుండి ఖర్చు చేసిన మొత్తం 3629.83 కోట్లు
👉ఎలాంటి ఉపయోగం లేని ప్రచార ఆర్భాట ఆకుపచ్చ కండువాలకు 7.31 కోట్లు .
👉ప్రజా ధనం వేల కోట్లు ఖర్చు చేసి బతికిచ్చిన మొక్కల లేక్క మాత్రం లేదు…అంటే శూన్యం అని అర్థం చేసుకోవాల!!
👉సొమ్ము ఒక్కడిది షోకు ఒక్కడిది అన్నట్లు KCR తీరు ఉంది.
👉మొక్కలకు వేసిన GEO tag అంతా బూటకమేనా?
👉ప్రజల సొమ్ము పంది కొక్కుల మేయాడమే మీ పనియా ?
👉3629.83 కోట్లు ఖర్చు చేస్తే 3 వేల మొక్కలు బతికి నట్లు ఆధారాలు లేవు అంటే ఆ ప్రజా సొమ్ము ఎక్కడికి పోయింది??


👉ప్రతి పక్షాలు మాట్లాడితే చూసార మేము రాష్ట్రాన్ని పచ్చగా చేస్తుంటే కండ్లు మండి కాళ్లల్లా కట్టెలు పెట్టి అడ్డుపడుతున్నారు అడ్డం పడుకుంటున్నరు అంటారు.
👉ఈటెల రాజేందర్ గారే స్వయంగా అసెంబ్లీలో 10054 పోస్టులు ప్రభుత్వ దవాకనాలో కాలీగా ఉన్నవి అన్నారు ఇప్పుడు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉంది ఈ సమయంలో కూడా ఎలాంటి ప్రణాళిక లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం.ప్రజల ప్రాణాలు అంటే ఇంత చులకననా?చెట్టుకు ఇచ్చిన
విలువ,కమీషన్ లకు ఇచ్చిన విలువ COVID-19 pandemic పరిస్థితి లో మనిషికి ఇవ్వక పోవటం సిగ్గుచేటు.
👉తెలంగాణలో విద్యా గాలికి వదిలేసి ఇప్పటి వరకూ VC లు లేకపోవడం,university లో 1650 అధ్యాపకుల పోస్టులు ఖాళీ గా ఉన్నవి.11 University లు 1600 కోట్ల అడిగితే 582 కోట్ల తో సరి పెట్టారు అంటే KCR కు పేద వాడి విద్యా పట్ల ఎంత సొయి ఉందో చెప్పే ప్రయత్నం. ప్రచార ఆర్భాటం కోసం ఆకు పచ్చ కండువాలకు 7 కోట్లు ఖర్చు దుబారా కదా?
👉కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదు? వారిని ఆదుకునే చర్యల విషయంలో కాని, ఉచిత కరోనా చికిత్స కాని ఎందుకు ఖర్చు చేయ లేక పోతుంది ఈ పరిస్థితి ల్లో కూడా కోట్లు ఖర్చు చేసి హరిత హారం పేరుతో అవినీతికి తెరలేపారు.
👉ఈ హరిత హారం నిధుల మీద తెలంగాణ ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వయిరీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
👉COVID-19 విపత్తు నివారణ చర్యలు చేపట్టలేని అసమర్థత ప్రభుత్వం.దున్నపోతు మీద వాన పడ్డట్టు KCR తీరు ఉంది.
Indirashoban Poshala
Tpcc official spokesperson