కాళేశ్వరం కరెంటు బిల్లు…గుండె ఝల్లు

👉కాళేశ్వరం మొదటి నెల కరెంటు బిల్లు వచ్చింది. సముద్రమట్టానికి 100మీటర్ల ఎత్తున్న మెడిగడ్డ నుండి, 119మీటర్ల ఎత్తున్న అన్నారానికి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాడానికి అయిన కరెంటు బిల్లు కోటిన్నర రూపాయలు.
👉అంటే ఇది 19మీటర్లు నీటిని ఎత్తిపోయాడానికి అయిన ఖర్చన్నమాట.
👉కాళేశ్వరానికి గుండెకాయ అని ప్రభుత్వం చెప్తున్న మల్లన్నసాగర్ సముద్రమట్టానికి 557మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే మెడిగడ్డ నుండి 457 మీటర్లు.
👉మెడిగడ్డ నుండి19మీటర్ల ఎత్తున్న అన్నారానికి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాడానికి కోటిన్నర ఖర్చయితే 457 మీటర్ల ఎత్తున్న మల్లన్నసాగర్ కు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాడానికి అయ్యే ఖర్చు 36.07 కోట్ల రూపాయలు.
👉ఒక టీఎంసీ నీటితో 6000ఎకరాల మాగాణి, లేక 10000ఎకరాల మెట్ట పంటలు వేయవచ్చని ప్రభుత్వ లెక్క. అంటే సగటున ఒక టీఎంసీతో 8000ఎకరాలు సాగుచేయవచ్చు.
👉ఈ లెక్కన మల్లన్నసాగర్ కింద సాగుకు ఒక ఎకరానికి ఒక పంటకు వచ్చే కరెంటు ఖర్చు సుమారు 45000 రూపాయలు. నీటి సరఫరాలో ఆవిరి, సీపీజీ నష్టాలు తీసివేస్తే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది.
👉ఇంతే కాదు.
పైన చెప్పింది కరెంటు బిల్లు మాత్రమే! ఇక కాళేశ్వరంపై పెట్టిన రూ 80500 కోట్ల పెట్టుబడి పై ఏటా అసలు, వడ్డీ చెల్లింపులు, ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు దీనికి రెట్టింపు ఉండబోతున్నాయి. అంటే ఎకరా సాగుకు ఏటా ఖర్చు లక్షరూపాయల పైనే. (ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను ప్రపంచానికి చాటిచెప్పడానికి అయిన వందల కోట్ల రూపాయలను మినహాయించి).
👉ఇక చెప్పండి…ఎకరానికి పంటకు ఏటా లక్ష చెల్లించే రైతు రారాజులెవ్వరో!
👉ప్రభుత్వమే చెల్లిస్తుందంటే, రాష్ట్ర బడ్జెట్ కాళేశ్వరానికే సరి!!!
✨కొసమెరుపు: నిర్మాణం కానున్న మల్లన్నసాగర్ నిలువ సామర్ధ్య 50టీఎంసీలు. అంటే టీఎంసీకి రూ45 కోట్ల చొప్పున, ఒకసారి మల్లన్నసాగర్ నింపాలంటే అయ్యే కరెంటుఖర్చు 2250 కోట్ల రూపాయలు!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *