Site icon Polytricks.in

సంచలనం రేపుతున్న ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీం?

ఎస్‌బీఐ బ్యాంక్ ఎవ్వరూ ఊహించని గొప్ప శుభవార్త చెప్పింది. స్పెషల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ స్కీంను దీనిని ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్’ డిపాజిట్ అంటారు. గడువు ముగిసింది అని ఈ స్కీం ని మొన్నటివరకు మూసేసింది.  ఇది ఉహించినదాని కంటే గొప్పగా హిట్ అయ్యింది. అందుకే మళ్లీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఇది 400 రోజుల వ్యవధి ఉండే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం. గతంలో ఇదే కాలవ్యవధితో స్టేట్ బ్యాంక్ దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది.

దీనిని 2023, ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టింది. దీనిలో చేరేందుకు చివరి తేదీని మార్చి 31 గా నిర్ణయించింది. కానీ  ఉహించిన దానికంటే ఎక్కవమంది ఇందులో డిపాజిట్లు  చేరారు. అయితే ఇది లాభాలు కురిపించడంతో వెంటనే 15 రోజుల తర్వాత మళ్లీ అదే స్కీంను తీసుకొస్తున్నట్లు ప్రకటించి కస్టమర్లకు మంచి శుభవార్త ఇచ్చింది.

ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. ఈ ప్రత్యేక డిపాజిట్ పథకంలో కస్టమర్లకు అధిక వడ్డీ అందుతుంది. ఎస్బిఐ అన్ని పథకాలకంటే ఇందులోనే అధిక వడ్డీ వచ్చే కల్పతరువు.

సాధారణ డిపాసిటర్లకు 7.10 శాతం వడ్డీ రేటు పొందుతారు. ఇక సీనియర్ సిటిజెన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర లాభం పొందుతారు. ఈ లెక్కన వారికి 7.60 శాతం వడ్డీ అందుతుంది. ఇక ఈ స్కీంలో చేరేందుకు ఆఖరి తేదీ 2023, జూన్ 30 గా నిర్ణయించింది. మరో 2 నెలల సమయం మాత్రమే ఉంది. త్వరపడండి.

Exit mobile version