Site icon Polytricks.in

రెజీనాతో సందీప్ కిషన్ ప్రేమాయణం..?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనాల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరు డేటింగ్ కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ వీరిద్దరి ప్రేమాయణం వార్తలకు బలం చేకూర్చుతోంది.

రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే పాప. లవ్యూ. నువ్వు చేసే అన్ని పనుల్లో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. స్టే బ్లేస్ద్ అని సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ పిక్ ను కూడా షేర్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

దీంతో సందీప్ కిషన్, రెజీనాల మధ్య ప్రేమాయణం నిజమేనని నెటిజన్లు స్పందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రారా కృష్ణయ్య, నక్షత్రం అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 

Exit mobile version