Site icon Polytricks.in

ఈనెల నుంచి రాష్ట్ర ఉద్యోగుల జీతాలు బంద్?

సంపదలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి అని కెసిఆర్ ఎంత గట్టిగా ఉదరగోట్టినా అవి అన్ని అబద్దాలేనని తేలిపోయింది. చేసిన అప్పులకు కిస్తిలు కట్టలేని దుస్తితిలో ఉంది. ఈనెల రూ. 5 వేల కోట్ల కిస్తి కట్టాలి. కానీ ఆర్థిక శాఖా దగ్గర నయా పైసా లేదు. ఈ కిస్తి కట్టేందుకు మళ్ళి అప్పు చేయవలసిన దుస్తితి. అందుకే ఆర్బిఐ దగ్గర మరోసారి అప్పు చేసి ఈ కిస్తి కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఈ కిస్తీలు సరిగ్గా కట్టకపోతే ఓపెన్ మార్కెట్లో పరువుపోతుంది. ఇకపై అప్పు పుట్టదు.

ఈ నెల ఉద్యోగుల జీతాలు ఎలా ఇవ్వాలో కెసిఆర్ కి అర్థం కావడం లేదు. ఇప్పటికే ‘రైతుబంధు’ పథకం కింద సగం కోతలు విధించారు. కేవలం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకే డబ్బులు పంచారు. 11 ఎకరాల భూములు ఉన్న రైతులను ‘మోతుబరి రైతులు’, వాళ్లు ధనవంతులు, వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థక సహాయం అవసరం లేదు అనే కొత్త వంకతో  కోత విధించారు.

”చేతిలో చిల్లి గవ్వలేదు. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి?” అన్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు చేతులు ఎత్తేశారు. అసలే ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోయినా, రైతుబంధు అమలు చేయకపోయినా ప్రజల ఆగ్రహం చూడక తప్పుదు. దీనిని ప్రతి పక్షాలు తెలివిగా వాడుకుంటాయి.

ప్రగతి కోసం కాదు, చేసిన అప్పు కిస్తిలను కట్టడానికి మళ్ళి అప్పులు చేయవలసిన దుస్తితి ప్రభుత్వానిది. తల్లి కంటే పిల్ల వేగంగా పెరిగినట్లు ‘అసలు’ కంటే వడినే ఎక్కువగా పెరుగుతోంది. దాని మీద పెరిగిన చక్రవద్దిలే ఎక్కువయ్యాయి. ఇలా వడ్డీలు కడుతుపోతే ‘అసలు’ అప్పు ఎప్పుడు తీరేనో దేవుడికే తెలియాలి.

ఇక సర్కార్ కి రావలన ఆదాయం పూర్తిగా పడిపోయింది. రెవెన్యు నుంచి రావలసిన ఆదాయం అంతంత మాత్రమే వస్తోంది. ఇతర దారులు ముసుకున్నాయి. కాబట్టి ఈ నేలనుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన జీతాలను ఎలా అర్ధలో అర్థం కాక కెసిఆర్, హరీష్ రావు తలలు పట్టు కుంటున్నారు.

Exit mobile version