Site icon Polytricks.in

సినిమాలకు గుడ్ బై – క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

హీరోయిన్ సాయి పల్లవి అరుదైన అమ్మాయి. ఓ కాన్సెప్ట్ తో సాగే హీరోయిన్. కథ సరిగా లేదనుకుంటే ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా అందులో నటించదు. అందుకే సాయి పల్లవికి తక్కువ కాలంలోనే క్రేజ్ వచ్చింది. ఇందుకే కాదు. పొట్టి , పొట్టి నిక్కర్లు వేసుకొని అందరి హీరోయిన్స్ లా స్కిన్ షో అసలే చేయదు. సాయి పల్లవిని చూస్తె నేటితరం సౌందర్యలా అనిపిస్తుంటుంది.

డబ్బుల కోసం ఏమాత్రం కక్కుర్తి పడదు. సినిమా నిరాశపరిచి నిర్మాత నష్టపోతే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోట్లు ఆఫర్ చేసి యాడ్ లో నటించండని కోరినా.. జనాలను మోసగించే ప్రకటనలలో నటించేది లేదంటూ చెప్పేసింది. ఇన్ని గొప్ప లక్షణాలు కల్గిన అమ్మాయి కనుకే సాయి పల్లవికి ఫాలోయింగ్ ఎక్కువ.

ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో ఆమె భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలాంటి సాయి పల్లవి సినిమాలు మానేస్తుందనే ప్రచారంతో ఆమె అభిమానులు తెగ హైరానా పడిపోయారు. సాయి పల్లవి కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. డిమాండ్ ఉన్న హీరోల సినిమాలు కూడా చేయకపోవడంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనని ప్రచారం జరిగింది.

సినిమాలకు గుడ్ బై చెప్పెశారనే వార్తలపై సాయి పల్లవి స్పష్టత ఇచ్చారు. సినిమాలు చేయడం మానేయలేదని ఆమె పరోక్షంగా చెప్పారు. మంచి కథ, పాత్రలు వస్తే నటిస్తానని స్పష్టం చేసింది. అందరూ నన్ను సొంతింటి ఆడపిల్లలా ట్రీట్ చేస్తారు. వారి అంచనాలకు తగ్గట్టుగా నటించడం నా భాద్యత. అందుకే కథ ఎంపికలో జాగ్రత్త పడుతుంటానని చెప్పుకొచ్చింది.

Exit mobile version