Site icon Polytricks.in

రూ. 2000 నోటు బ్యాన్ కానుందా? ఇది బిజెపి నాయకులకు ముందే తెలిసిందా?

అవినీతిని అంతం చేస్తాము, దేశంలో ‘లంచం’ తీసుకునే వ్యవస్త లేకండా చేస్తామని చెప్పే బిజెపి సర్కార్ లంచం తీసుకుంటూ ఈ రోజు అడ్డంగా దొరికింది. కర్ణాటకలో ఏ పని చేయాలన్నా బిజెపి ప్రభుత్వం లంచం లేకుండా చేయదు. ప్రతి పనికి లంచం ముందే ఫిక్స్ చేస్తారు. దేనికి ఎంత శాతం లంచం ఇవ్వాలో ముందే చెపుతారు. ఓ ఎంఎల్ఏ కొడుకు ఒక పని చేసేందుకు 40 శాతం కమిషన్ (లంచం) ఫిక్స్ చేశాడు. ఆ పని కాగానే రూ 40 లక్షలు లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికి పోయాడు.

తీగ లాగితే దొంక కదిలింది. అతనిని అరెస్ట్ చేసిన అధికారులు అతని ఇంట్లో సోదాలు జరిపారు. వాళ్ళకు దిమ్మ తిరిగింది. ఇంటినిండా డబ్బే. దాదాపు ఆరు కోట్ల రూపాయలు దొరికాయి. ఇంకా సోదాలు చేస్తున్నారు. ఇంకా ఎన్ని కోట్లు బయటపడతాయో తెలియదు. రెండు లక్షల రూపాయలకు మించి క్యాష్ ఉంచుకోరాదని కేంద్రమె చెపుతోంది. అలా ఉంచుకుంటే అంది బ్లాకు మని కిందికి వస్తుంది అని కేంద్రం చట్టాలు తాయారు చేసింది. మరి ఇది బిజెపి నాయకులకు వర్తించదా?

అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే – సామాన్యంగా ఇంత పెద్ద నగదుని ‘పెద్ద నోట్లల్లో’ దాచుకుంటారు. అంటే నిజానికి రూ. 2000 నోట్ల కట్టలు దొరకాలి. కానీ కేవలం రూ. 500 రూపాయల నోట్ల కట్టలు మాత్రమే దొరికాయి. ఎందుకు?

మోడి సర్కార్ త్రూవరలో రూ. 2000 నోటు బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పుకారు ఉన్నాయి. ఆ పుకార్లు నిజమని నమ్మాలని ఇప్పుడు అనిపిస్తోంది. అంటే రూ. 2000 నోటును బ్యాన్ కాబోతోంది అని బిజెపి నాయకులను ముందే లీక్ అయ్యిందా? కావచ్చు. అటు కేంద్రంలో, ఇటు కర్ణాటకలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది. కాబట్టి ముందుగా లీక్ కాకుండా ఎలా ఉంటుంది? అనే అనుమానాలకు తావు ఇస్తోంది ఈ కేసు.

అయితే ఈ కేసు వివరాలను అధికారులు బయటికి రాకుండా కట్టుదిట్టం చర్యలు తీసుకున్నారు. ఆ అధికారులు ఎవ్వరు, ఆ ఎం ఎల్ ఏ ఎవరు? ఆ ఎం ఎల్ ఏ కొడుకు పేరు ఏమిటి? ఆ లంచం ఏ పనిలో తీసుకున్నాడు అనే వివరాలు గోప్యంగా ఉంచారు. ఎంతైనా డబుల్ ఇంజన్ సర్కార్ కదా?

Exit mobile version