Site icon Polytricks.in

బండి సంజయ్ కుమారుడి ఇష్యూపై ఆర్జీవీ సంచలన ట్వీట్ – సినిమా తీస్తారా..?

బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమారుడి వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపింది. కాలేజ్ లో సహా విద్యార్ధిపై బండి కుమారుడు భగీరథ దాడి చేసిన ఘటన చర్చనీయాంశం అయింది. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడని విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ ను టార్గెట్ చేసుకొని ఆయన కుమారుడిపై మండిపడుతున్నారు.

ఇదే విషయంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆర్జీవీ తనదైన శైలిలో సంజయ్ పై ట్వీట్ చేశారు. సంజయ్ ను సద్దాం హుస్సేన్ గా కొడుకును ఉదయ్ హుస్సేన్ అని పోల్చుతూ ట్వీట్ చేశారు. సంజయ్ ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇరాక్ ను వణికించిన సద్దాం హుస్సేన్ సంజయ్ రూపంలో బతికే ఉన్నాడని ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.

సినీ అంశాలపైనే కాకుండా రాజకీయపరమైన అంశాలపై కూడా స్పందిస్తుంటారు ఆర్జీవీ. పలువురిపై నిత్యం విమర్శలు చేస్తుంటారు. తాజాగా బండి సంజయ్ కుమారుడి ఇష్యూపై ట్వీట్ చేశారు.

వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. నీ బతుకు అషురెడ్డి కాళ్ల దగ్గరే అని ప్రతిగా ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల గురించి నీకేందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొందరు భగీరథకు సంబంధించిన వీడియోలు ఇంకా పంపుతాం సినిమా తీయండని ఉచిత సలహా ఇస్తున్నారు. తిక్క రేగితే ఈ ఇష్యూపై సినిమా తీసినా తీస్తారంటూ మరికొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version