Site icon Polytricks.in

బిగ్ బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

ఏఐసీసీ ఆదేశాలతో పాదయాత్ర చేపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ దగ్గర శనివారం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది.

కాన్వాయ్ లోని కార్లు అతివేగంతో ఒకదానికొకటి డీకొన్నాయి. కార్లలోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. కొంతమంది రిపోర్టర్లు గాయపడినట్లు సమాచారం. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version