Site icon Polytricks.in

అస్వస్థతకు గురైన రేణు దేశాయ్…పరామర్శకు పవన్ కళ్యాణ్

సినీతరాలకు రకరకాల వింత రోగాలు వస్తున్నాయి. హీరోయిన్ సమంత “మయోసైటిస్” అనే వ్యాధితో పోరాడి చావు గండం నుంచి బయటపడగా.. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అస్వస్థతకు గురయ్యానంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గుండెకు సంబంధించిన వ్యాధితో చాలా కాలం నుంచి బాధపడుతున్నాను. ఈ సమస్య నుంచి తొందరగా కోలుకునేందుకు శక్తిని కూడదీసుకుంటున్నాను. అయితే.. తాను మళ్ళీ ఆరోగ్యం ఉండాలంటే మీ అందరి దీవెనలు కావాలంటూ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఎమోషనల్ గా ఉంది.

రేణు దేశాయ్ ఈ పోస్ట్ చేసిన వెంటనే పవన్ అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆమెపై ప్రత్యేక తరహ అభిమానం చూపిస్తున్నారు. ఆమెని తమ సొంత వదినలాగానే ట్రీట్ చేస్తూ.. త్వరగా కోలుకోవాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇకపోతే రేను దేశాయ్ ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా ఆమెను సంప్రదించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇద్దరు విడిపోయారే కానీ మంచి ఫ్రెండ్స్ లా మెదులుతున్నారు. ఆమె ఆరోగ్యం విషయమై ఈ వారంలో రేను దేశాయ్ ను పవన్ కళ్యాణ్ కలవనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version