Site icon Polytricks.in

పవన్ కళ్యాణ్ అలాంటివాడా..? రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళను ప్రస్తావన తీసుకొస్తూ జనసేనాని రాజకీయ ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటంతో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను పవన్ కు మద్దతుగా లేనని చాలామంది విశ్లేషిస్తున్నారని ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను మొదటి నుంచి ఇప్పటివరకు కూడా పవన్ కు సపోర్ట్ గా ఉన్నానని చెప్పారు.

సమాజం కోసం మంచి చేయాలని పరితపించే నేత పవన్ కళ్యాణ్ అని…ఆయనది అరుదైన వ్యక్తిత్వమని కొనియాడారు. ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కు లేదని..పేదలకు మంచి చేయాలని పరితపించే వ్యక్తి అంటూ స్పష్టం చేశారు. ఈమేరకు ఇన్స్టాలో ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు.

సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడని..దయచేసి పవన్ కు ఒక్క అవకాశం ఇవ్వండని రేణు దేశాయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంపై అవాకులు, చెవాకులు పేల్చడం మానుకోవాలని వైసీపీ నేతలకు పరోక్షంగా హితబోధ చేసింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై చర్చను ఆపండని కోరారు. ఈ వివాదాల్లోకి తమను లాగకండి అంటూ రిక్వెస్ట్ చేశారు.

Also Read : సర్కార్ పై రేణు దేశాయ్ ఆగ్రహం – కోర్టులో తేల్చుకుంటానని..!!

Exit mobile version