Site icon Polytricks.in

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట – అనర్హత వేటు ఎత్తివేస్తారా..?

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట కల్గింది. అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్దరణకు మార్గం సుగమం అయింది.

మోడీ అనే పేరుతో ఉన్న వాళ్ళంతా దొంగలేనని రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల సమయంలో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై పూర్నేష్ మోడీ అనే గుజరాత్ ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీనిపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. కింది కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్దించడంతో ఇటీవల రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జూలై 15న సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలు విన్న అనంతరం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గరిష్ట శిక్ష విధింపులో ట్రయల్‌ కోర్టు సరైన కారణం చూపించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యులుగా కొనసాగవచ్చు అని పేర్కొంది.

అయితే.. సుప్రీం తీర్పుతో రాహుల్ గాంధీ రేపటి నుంచి పార్లమెంట్ కు వెళ్తారా..? అనే ఉత్కంట నెలకొంది. మణిపూర్ ఘటనపై పార్లమెంట్ అట్టుడికిపోతున్న వేల రాహుల్ లోకసభలోకి అనుమతి ఇస్తారా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. చూడాలి మరి ఎం జరుగుతుందో..!!

Also Read : రాహుల్ గాంధీ అంటే బీజేపీకి ఎందుకంత భయమో చదవండి

Exit mobile version