Site icon Polytricks.in

డేరా బాబాను విడుదల చేయడం తప్పుకాదు! అతను మరిన్ని హత్యలు చేసే అవకాశం కల్పించాలి?

కొన్ని అత్యాచారాలు, రెండు హత్యలల్లో దోషిగా తేలి జైలులో శిక్షను అనుభవిస్తున్న సుప్రసిద్ధ నేరస్తుడు, మన దేశం పరువు ప్రతిష్టలను నలు దిశలా వ్యాప్తి చేసిన డేరా బాబాను పెరోల్ మీద 40 రోజులు విడుదల చేయడం తప్పు కాదని హరియానా ప్రభుత్వం వితండ వాదంతో తనను తాను సమర్ధించుకుంది. అతను కఠిన మైన నేరాలు చేసిన ఖైది కాదని పంజాబ్, హరియానా హై కోర్ట్ కు తెలిపింది. ఎంత విడ్డూరం?

డేరా బాబాను విడుదల చేయడాన్ని తప్పుపడుతూ శిరోమణి గురుద్వారా ప్రబంద్ కమిటి ఇటీవల హై కోర్ట్ ని ఆశ్రయించింది. దీని మీద హరియానా ప్రభుత్వం వితండ వాదంలోకి దిగి ఇలా తన వాదనలు వినిపించింది. కేవలం రెండు హత్యలల్లో దోషిగా తేలిన బాబాను విడుదల చేస్తే మాత్రం అతను మరిన్ని హత్యలకు పాల్పడే హంతకుడిగా చూడరాదని వాదించింది.

ఇప్పటివరకు బయటపడిన హత్యలల్లో అతను నేరుగా పాల్గొనలేదు అనే ఓ వింత వాదనను తెరమీదికి తెచ్చింది. అంటే కనీసం పాతిక రేపులు, వంద హత్యలు చేసిన వాళ్ళు మాత్రమే నేరస్తులు అని ప్రభువం భావన కాబోలు!!! డేరా బాబాను విడుదల చేయడం తప్పుకాదు, కాబట్టి అతను మరిన్ని హత్యలు చేసే అవకాశం కల్పించాలి, మరి కొందరిని రేప్ చేసే అవకాశం కూడా  కల్పించాలని ఆశిస్తోందో ఏమిటో?

అతను బయటికి రాగానే తన పుట్టిన రోజు కేక్ ని ఖడ్గంతో కత్తిరించి సంచలనం సృష్టించాడు. అతనికి వ్యతిరేకంగా వాదించిన లాయర్లు, పోలీసులు భయపడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. అయినా కేవలం డేరా బాబా కులానికి  చెందిన వాళ్ళ  ఓట్ల  కోసం  హరియానా  ప్రభుత్వం ఇలా దిగజారడం సోచనియం.

Exit mobile version