Site icon Polytricks.in

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచారు.. మరి దరఖాస్తు గడువు ??

మరో రెండేళ్లు పెంచిన ప్రభుత్వం
గతంలో 3 ఏళ్ల పెంపు
భారీగా పెరగనున్న దరఖాస్తులు
దరఖాస్తు గడువు ఈ రోజుతో ఆఖరు ?
గడువు పెంపుపై ఇంకా వెలువడని ప్రకటన
ఆందోళనలో అభ్యర్థులు – ఇంటర్నెట్ తో కుస్తీలు

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌ విజ్ఞ‌ప్తుల మేర‌కు మ‌రో రెండేండ్ల వ‌యోప‌రిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని కోరుతూ వచ్చిన విన్నపాలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజీపీని ఆదేశించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఇప్ప‌టికే మూడేండ్ల వ‌యోప‌రిమితి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 2 ఏళ్లు పెంచడంతో… మొత్తంగా యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి 5 ఏళ్లు పెంచినట్లైంది.

వయోపరిమితి మరో రెండేళ్లు పెంచడంతో… ఓసీ అభ్యర్థుల ఏజ్ లిమిట్ పోలీసు కానిస్టేబుల్ పోస్టులకి 27 ఏళ్లు, ఎస్సై పోస్టుకి 30 ఏళ్లకు పెరిగింది. బీసీ అభ్యర్థులకు మరో 3 ఏళ్లు, ఎస్సీ – ఎస్టీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అద్భుత అవకాశం. దీంతో.. పోలీసు ఉద్యోగాలకు పోటీ పడే వారి సంఖ్య ఇంకా పెరగనుంది.

కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకి మే 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తుడి గడువు మే 20. అంటే… ఈ రోజే ?? దరఖాస్తులకి ఆఖరి రోజు వయోపరిమితి మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇంతవరకు దరఖాస్తుల సమర్పణ తేదీ గడువును పెంచుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో.. అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్ల మీద పడ్డారు. ఒకేసారి ఎక్కువ మంది అప్లికేషన్ ఫీజు చెల్లిస్తుండటంతో.. సర్వర్ లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వయోపరిమితి పెంచినందున.. గడువు కూడా పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.

రాష్ట్రంలో 17, 291 ఉద్యోగాల భర్తీ కోసం పోలీసు నియామక మండలి నోటిఫికేషన్లు విడుదల చేయగా… ఈ రోజు ఉదయం వరకు అన్ని పోస్టులకి కలిపి 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.

Exit mobile version