Site icon Polytricks.in

26 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన రాహుల్ గాంధీ? యంగ్ అండ్ స్మార్ట్ బాయ్?

వయసులో 52 ఏళ్ల రాహుల్ గాంధీ ఒక్కసారిగా 50 శాతం డిస్కౌంట్ పొందారు. ఇప్పుడు ఆయన వయసు కేవలం 26 మాత్రమే. ఇదెలా సాధ్యం అయ్యిందో తెలుసా? చాలా సింపుల్. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన గెడ్డం చేసుకోనని శపథం చేశారు. ఆ యాత్ర పూర్తీ అయ్యేసరికి ఆయన గెడ్డం మోడీ గెడ్డం కంటే ఎక్కువగా పెరిగింది. పొతే 52 ఏళ్ల వయసు కాబట్టి గెడ్డంలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు బయట పడ్డాయి. దాంతో ఆయన వయసు మీద పడిన వాడిలా కనిపించారు. గడ్డానికి బ్లాక్ ఎయిర్ డై వేయమని ఎంతమంది చెప్పినా అయన వినలేదు. రంగు వేయలేదు, కనీసం గెడ్డం ట్రిమ్ చేయలేదు. మొన్న జరిగిన కాంగ్రెస్ ప్లినరిలో కూడా ఓ మునిలా పాల్గొన్నారు.

కానీ ఆయన చదివిన క్రేంబిడ్జ్ విశ్వవిద్యాలయంలోని వివిధ కార్యక్రమాలల్లో పాల్గోడానికి నిన్న లండన్ వెళ్లారు. బాగా పెరిగిన గడ్డాన్ని చిన్నగా ట్రిమ్ చేసి, ఎయిర్ కట్టింగ్ చేయించి 26 ఏళ్ల కుర్రాడిలా మారారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు వెళ్ళిన విశ్వవిద్యాలయం అధికారులు, ఇతరులు ముందుగా గుర్తుపట్టలేదు. కాసేపటి తర్వాత నిజం తెలుసుకుని కంగుతిన్నారు. ఇప్పుడు ఆయనను పెళ్లి చేసుకోడానికి చాలా మంది అమ్మాయిలు పోటి పడుతున్నారు. అయన వారం రోజులు అక్కడే ఉంటారు.
౦౦౦

Exit mobile version