-వరంగల్ సభలో కీలక ప్రసంగం
-ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో భేటీ
-అమరవీరుల కుటుంబాలతో కలిసి భోజనం
– ముఖ్యనేతలతో సమావేశం, దిశానిర్దేశం
– రెండు రోజుల పాటు సాగనున్న రాహుల్ టూర్
తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 6 న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకోనున్నా రాహుల్.. హెలికాప్టర్‌లో నేరుగా వరంగల్ వెళ్తారు. వరంగల్ ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొంటారు. సభా ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు. రాహుల్, ముఖ్య నాయకులు ఒక వేదికపై కూర్చుంటారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సభ్యుల కోసం మరో వేదికను కేటాయించారు. రాత్రి 7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగం ఉంటుంది. 7 గంటలకు రాహుల్ ప్రసంగిస్తారు.
సభ తరువాత రోడ్డు మార్గాన రాహుల్ హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. ఏడో తేదీన ముఖ్య నాయకులతో అల్పాహారం చేస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్క్‌కు వెళ్లి, నివాళులు అర్పిస్తారు. అనంతరం నేరుగా గాంధీ భవన్‌కు వెళ్లి, దాదాపు 200 మంది ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. డిజిటల్ సభ్యత్వ నమోదు జరిగిన తీరును వివరిస్తూ ఏర్పాటు చేయనున్న ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు.
రాహుల్ టూర్ సాగనుందిలా..!
